బిగ్ బ్రేకింగ్ : డెల్టా వైరస్‌పై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు..

by  |
dh-srinivasa-rao -1
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న డెల్టా వైరస్ పై తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మానవ శరీరంపై డెల్టా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, అంతేకాకుండా ఎక్కువ కాలం ప్రభావం చూపుతుందని, ఇన్ ఫెక్షన్ కలిగించే స్వభావం కలగదని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా 70కు పైగా కేసులు నమోదు అవ్వగా.. తెలంగాణలోనే రెండు డెల్టా ప్లస్ కేసులు వెలుగుచూశాయన్నారు.

అయినప్పటికీ కొందరు కరోనా వచ్చినా కూడా ఇష్టానుసారంగా బయట తిరుగుతున్నారని మండిపడ్డారు. భవిష్యత్‌లో కరోనా టీకా వేసుకున్న వారినే హోటళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లలోకి అనుమతించే అవకాశం ఉందన్నారు. థర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉన్నదని, ఇప్పటికే కొన్ని జిల్లాలో మళ్లీ వైరస్ విజృంభిస్తోందని కావున ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని డీహెచ్ శ్రీనివాసరావు హెచ్చరించారు.


Next Story

Most Viewed