ఈటలకు ఊహించని షాక్.. జమున హేచరీస్‌కు మళ్లీ నోటీసులు

by  |
ఈటలకు ఊహించని షాక్.. జమున హేచరీస్‌కు మళ్లీ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమితో పెద్ద సారు అప్రమత్తం అయినట్టు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కూడా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌కు బహిరంగ హెచ్చరిక చేసిన కేసీఆర్‌.. హుజూరాబాద్ విజయంతో జోష్‌లో ఉన్న ఈటలకు మరో షాకిచ్చారు. ఈ నేపథ్యంలోనే జమున హేచరీస్‌కు మళ్లీ నోటీసులు వెళ్లడం కలకలం రేపుతోంది.

మూసాయిపేట మండలంలోని అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణ, రైతుల ఫిర్యాదు నేపథ్యంలో మంత్రి పదవి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన ఈటల రాజేందర్.. బీజేపీలో చేరి విజయం సాధించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో విచారణపై ఎటువంటి నిర్ణయం తీసుకోని కేసీఆర్ తాజాగా మరోసారి విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే జమున హేచరీస్‌కు నోటీసులు వెళ్లడం గమనార్హం. ఇందులో భాగంగా నవంబర్ 16న అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.


Next Story

Most Viewed