ఎన్‌ఈపీపై వెబినార్ నిర్వహించనున్న గవర్నర్

by  |
ఎన్‌ఈపీపై వెబినార్ నిర్వహించనున్న గవర్నర్
X

దిశ, న్యూస్​బ్యూరో: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 (NEP)పై తెలంగాణ గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ఈనెల 13న వెబినార్​ నిర్వహించనున్నారు. పర్​స్పెక్టివ్ ఎబౌట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 అండ్ రోడ్ మ్యాప్ ఫర్ తెలంగాణ అనే అంశంపై విద్యారంగ ప్రముఖులతో గవర్నర్ వెబినార్ నిర్వహిస్తారు. గురువారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ వెబినార్​లో యూజీసీ(UGC) సభ్యులు, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్​ ఈ. సురేష్ కుమార్ భాష , నైపుణ్యాలు, ఉద్యోగిత అన్న అంశంపై ప్రసంగిస్తారు. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ డైరెక్టర్ రేవతి ‘స్కూల్ ఎడ్యుకేషన్, సోషల్​ సైన్సెస్’ అంశపై ప్రసంగిస్తారు. ఈ నూతన జాతీయ విద్యా విధానం ద్వారా దేశ విద్యావ్యవస్థలో, తెలంగాణ విద్యావ్యవస్థలో రాబోయే సమూల మార్పులను ఈ వెబినార్ ద్వారా చర్చించి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు


Next Story

Most Viewed