- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బ్రేకింగ్ : కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ
<p>దిశ, వెబ్‌డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల నీటి వినియోగానికి సంబంధించి బోర్డులను ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా కృష్ణా నది జలాల మేనెజ్‌మెంట్ బోర్డుకు లేఖ రాసింది. పోతిరెడ్డి పాడు నుంచి ఏపీ నీరు తరలించకుండా ఆపాలని విజ్ఞప్తి చేసింది. సాగర్ నీటి అవసరాల కోసం తరలింపు ఆపాలని తెలంగాణ బలంగా కోరుతున్నది. ఏపీ పరిమితికి మించి నీరు తీసుకుంటోందని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల నీటి వినియోగానికి సంబంధించి బోర్డులను ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా కృష్ణా నది జలాల మేనెజ్‌మెంట్ బోర్డుకు లేఖ రాసింది. పోతిరెడ్డి పాడు నుంచి ఏపీ నీరు తరలించకుండా ఆపాలని విజ్ఞప్తి చేసింది.
సాగర్ నీటి అవసరాల కోసం తరలింపు ఆపాలని తెలంగాణ బలంగా కోరుతున్నది. ఏపీ పరిమితికి మించి నీరు తీసుకుంటోందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఏపీ ఇప్పటికే 25 టీఎంసీల నీటిని తరలించిందని తెలంగాణ సర్కార్ లేఖలో పేర్కొంది. అయితే, ఇటీవల కేఆర్ఎంబీ నిర్వహించిన బోర్డు సమావేశాలకు హాజరయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరించిన విషయం తెలసిందే.
Next Story






