- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పర్యాటకులకు గుడ్ న్యూస్
<p>దిశ, తెలంగాణ బ్యూరో : రెండేళ్లుగా కరోనా కారణంగా నష్టాల్లో ఉన్న పర్యాటక శాఖకు కొంత ఉపశమనం పొందేలా గత నెల రోజులుగా పర్యాటకుల తాకిడి ఆశాజనకంగా కనిపిస్తోంది. అంతేకాకుండా మూతపడిన పర్యాటక ప్రాంతాలు తెరుచుకున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయంతో నెలల తరబడి వెకేషన్ లేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు రాష్ట్రంలోని వీకెండ్ స్పాట్స్ కోసం గూగుల్ చేస్తున్నారు. సోమశిల […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : రెండేళ్లుగా కరోనా కారణంగా నష్టాల్లో ఉన్న పర్యాటక శాఖకు కొంత ఉపశమనం పొందేలా గత నెల రోజులుగా పర్యాటకుల తాకిడి ఆశాజనకంగా కనిపిస్తోంది. అంతేకాకుండా మూతపడిన పర్యాటక ప్రాంతాలు తెరుచుకున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయంతో నెలల తరబడి వెకేషన్ లేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు రాష్ట్రంలోని వీకెండ్ స్పాట్స్ కోసం గూగుల్ చేస్తున్నారు.
సోమశిల నుంచి శ్రీశైలం వెళ్లే బోటింగ్ ట్రిప్‌ని పర్యాటక శాఖ తిరిగి ప్రారంభించింది. దీంట్లో రోడ్డు, బోటు ప్రయాణాలు ఉండే విధంగా ట్రిప్‌ని రూపొందించింది. దీంతో బోటింగ్ ప్రియులు ట్రిప్‌కి వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఈ బోటింగ్ ట్రిప్ ప్రారంభమవగా ప్రయాణికుల తాకిడి రోజు రోజుకూ పెరుగుతున్నట్లు పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు.
అయితే, ఈ ట్రిప్‌కి వచ్చే పర్యాటకులకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఇంటి భోజనాన్ని తలపించేలా హరిత హోటల్‌లో ఆహారాన్ని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ట్రిప్ గురించి తెలుసుకోవాలంటే పర్యాటక శాఖ ఫోన్ నెంబర్ 1800-425-46464 కి కాల్ చేయాలని అధికారులు తెలిపారు. ఈ ట్రిప్‌తో పాటు దైవ దర్శనాలకు వెళ్లే వారికి కూడా టూరిజం శాఖ ప్యాకేజీలను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి వెళ్లేందుకు రూ.500 నుంచి రూ.4500 వరకూ ప్యాకేజీ అందుబాటులో ఉంచారు.
శ్రావణ మాసం సందర్భంగా నగరం నుంచి వేములవాడ, కొండగట్లు, కొమురవెల్లి మల్లన్న ఆలయాలకు వెళ్లి వచ్చేందుకు ఒక్క రోజు టెంపుల్ ట్రిప్ ప్యాకేజ్ అందుబాటులో ఉందని రూ.1200 తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి శ్రీశైలం రెండు రోజుల ట్రిప్‌కి రూ.3999 ఛార్జీలుగా ప్రకటించారు. రామప్పను ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించడంతో పర్యాటకుల సంఖ్య పెరిగిందని, హైదరాబాద్ నుంచి రెండు రోజుల ప్రత్యేక ట్రిప్‌ను రూపొందించినట్లు టూరిజం శాఖ తెలిపింది.
హైదరాబాద్ నుంచి బయలుదేరి మొదటి రోజు యాదాద్రి ఆలయం, వరంగల్‌లోని వెయ్యి స్తంభాల ఆలయం, భద్రకాళి టెంపుల్, ఖిల్లా వరంగల్ ప్రాంతాలను చూసుకొని వరంగల్ హరిత హోటల్‌లో రెస్ట్ తీసుకుంటారని, మరుసటి రోజు రామప్ప ఆలయం, లక్నవరం చెరువును సందర్శించనున్నారు.
పర్యాటకుల ఆలోచనలకు అనుగుణంగా టూరిజం శాఖ వినూత్నంగా ప్రచారం చేస్తూ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేస్తూ పూర్తి వివరాలను అక్కడే తెలుపుతున్నది. వీకెండ్‌లో ఎక్కడికెళ్లాలో కూడా ముందు నుంచే అలర్ట్ చేస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. అంతరాష్ట్ర పర్యటక ప్రాంతాల కంటే తెలంగాణలోనూ అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయని తెలిపేలా వీడియోలు, చిత్రాలు ఉంచుతున్నారు. ఇలాంటి ప్రచారాలతో పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. కరోనా కూడా దాదాపు తగ్గిన నేపథ్యంలో కొవిడ్ భయాన్ని వదిలి పర్యాటక ప్రాంతాలకు వస్తున్నారు. దీంతో రెండేళ్లుగా పర్యాటక ప్రాంతాల్లో కనిపించని సందడి తిరిగి కనిపిస్తోంది.
- Tags
- Good news






