- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడ్ న్యూస్ : దళిత బంధు నిధులు విడుదల..
<p>దిశ ప్రతినిధి, నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం నిధులను గురువారం విడుదల చేసింది. సీఎం కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో బుధవారం పర్యటించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే తెలంగాణ దళిత బంధు పథకం పేరును ఖరారు చేయడంతో పాటు వాసాలమర్రి గ్రామంలోని దళితులకు సంబంధించిన నిధులను విడుదల చేశారు. దీనిలో భాగంగా వాసాలమర్రి గ్రామంలోని 76 మంది దళిత కుటుంబాలకు రూ.10 […]</p>

X
దిశ ప్రతినిధి, నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం నిధులను గురువారం విడుదల చేసింది. సీఎం కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో బుధవారం పర్యటించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే తెలంగాణ దళిత బంధు పథకం పేరును ఖరారు చేయడంతో పాటు వాసాలమర్రి గ్రామంలోని దళితులకు సంబంధించిన నిధులను విడుదల చేశారు.
దీనిలో భాగంగా వాసాలమర్రి గ్రామంలోని 76 మంది దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి జిల్లా కలెక్టర్‌కు రూ. 7.60 కోట్ల నిధులను గురువారం విడుదల చేసింది. దీనికి సంబంధించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో వాసాలమర్రి గ్రామంలో ఒక్కసారిగా దళిత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.
G.O.Rt.No.110- Vasalamarri

Next Story






