- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో లాక్‌డౌన్
<p>దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో బుధవారం (మే నెల 12) నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రతీ రోజు ఉదయం పది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు లాక్‌డౌన్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మాత్రం ప్రజలకు ఇబ్బంది లేకుండా పాలు, నిత్యావసరాలు, మందులు తదితరాలను కొనుగోలు చేయడానికి మాత్రం అవకాశం […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో బుధవారం (మే నెల 12) నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రతీ రోజు ఉదయం పది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు లాక్‌డౌన్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మాత్రం ప్రజలకు ఇబ్బంది లేకుండా పాలు, నిత్యావసరాలు, మందులు తదితరాలను కొనుగోలు చేయడానికి మాత్రం అవకాశం కల్పించింది. హైకోర్టులో విచారణ జరుగుతూ మధ్యాహ్నం 2.30 గంటల వరకు ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేయాలని డెడ్‌లైన్ విధించినందున మంత్రివర్గం అత్యవసర నిర్ణయం తీసుకుంది.
టీకాలకు కొరత ఏర్పడిన దృష్ట్యా విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటికే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు వెళ్ళనున్నట్లు ప్రకటించింది.






