చైనా ‘మంజా’పై బ్యాన్ కంటిన్యూ..

by  |
చైనా ‘మంజా’పై బ్యాన్ కంటిన్యూ..
X

దిశ, వెబ్‌డెస్క్ : సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది గాలిపటాలు. ఆరోజున చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ పతంగులు ఎగురవేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే, పతంగులు ఎగురవేసే సమయంలో వినియోగించే చైనా మంజాపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్( NGT) 2017లో బ్యాన్ విధించిన విషయం తెలిసిందే.

నాటి నుంచి నైలాన్, సింథటిక్ మంజాపై బ్యాన్ కొనసాగుతున్న ప్రతియేటా దాని వినియోగం ఏమాత్రం తగ్గట్లేదు. అయితే, ఈసారి మాత్రం గ్లాస్ కోటెడ్ ఎక్కువగా ఉండే చైనా మంజాపై తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సీరియస్‌గా దృష్టి సారించింది. ఎవరైనా నైలాన్, సింథటిక్ మంజాను అమ్మినా లేక కొన్న 1800-425-5364, 040-2323-1440 హెల్ఫ్‌లైన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎవరైనా వీటిని వినియోగించినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఈ మంజా వినియోగం వలన చాలా పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయని గతంలో NGT నిషేధం విధించిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed