ఫిట్​మెంట్​ 7.5 శాతం.. అడిగింది 63 శాతం

136

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ తొలి వేతన సవరణ కమిషన్​ నివేదిక విడుదలైంది. 32 నెలలపాటు కొనసాగిన అధ్యయనం గత నెల 31న సీఎస్​కు అందించిన విషయం తెలిసిందే. దీన్ని దాదాపు 28 రోజుల పాటు సీల్డ్​ కవర్​లోనే ఉంచిన అధికారులు.. బుధవారం ఉదయం విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్​మెంట్​ను 7.5 శాతంగా బిశ్వాల్​ కమిటీ రికమెండ్​ చేసింది. వాస్తవంగా ఉద్యోగులు మాత్రం 63 శాతం అడిగారు. పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏండ్లకు పెంచాలని, కనీస వేతనం రూ. 19 వేలు, గరిష్ట వేతనం రూ. 1,62,700లుగా వేతన సవరణ కమిషన్​ సూచించింది. ఇక హెచ్​ఆర్​ఏ శ్లాబుల్లో మార్పులు చేసింది. 11, 13, 17,24గా నిర్ణయించారు. గతంలో ఉన్న స్లాబు రేట్లను తగ్గిస్తూ సూచించారు. గతంలో 12,14,20,30 శాతంగా ఉన్నాయి.

Fin PR

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..