- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ తల్లి గోస.. స్పందించిన తెలంగాణ పోలీస్ బాస్
<p>దిశ, పాలేరు: ప్రస్తుత తెలంగాణా పోలీస్ బాస్ ముదిరెడ్డి మహేందర్ రెడ్డి.. దేశంలోనే తెలంగాణ పోలీస్ వ్యవస్థను నంబర్1 గా తీర్చిదిద్దాడు. ఖాకీ చోక్కాలో కాఠీన్యమే కాదు.. ఆ గుండెల్లో ప్రేమ కూడా ఉంటుందని నిరూపించాడు. వినూత్న, విప్లవాత్మక మార్పులను పోలీస్ శాఖలో తెచ్చి, మోడల్ పోలీస్‌గా దేశంలో ఖ్యాతి ఘడించేలా చేశాడు. ఇంతటి అద్భుతమైన వ్యక్తిని లాలించిన ఓ తల్లి ప్రస్తుతం తెరపైకి వచ్చింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన కంచర్ల […]</p>

దిశ, పాలేరు: ప్రస్తుత తెలంగాణా పోలీస్ బాస్ ముదిరెడ్డి మహేందర్ రెడ్డి.. దేశంలోనే తెలంగాణ పోలీస్ వ్యవస్థను నంబర్1 గా తీర్చిదిద్దాడు. ఖాకీ చోక్కాలో కాఠీన్యమే కాదు.. ఆ గుండెల్లో ప్రేమ కూడా ఉంటుందని నిరూపించాడు. వినూత్న, విప్లవాత్మక మార్పులను పోలీస్ శాఖలో తెచ్చి, మోడల్ పోలీస్‌గా దేశంలో ఖ్యాతి ఘడించేలా చేశాడు. ఇంతటి అద్భుతమైన వ్యక్తిని లాలించిన ఓ తల్లి ప్రస్తుతం తెరపైకి వచ్చింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన కంచర్ల మంగమ్మను ‘దిశ’ వెలుగులోకి తెచ్చింది. దీనిని చూసిన డిజీపీ మహేందర్ రెడ్డి వేకువజామునే స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ టీంని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం పురామయించి ఆమె వివరాలను సేకరించారు. వెలుగులోకి తెచ్చిన దిశని ప్రత్యేకంగా అభినందించారు. ఆ అవ్వను ఖమ్మం అన్నం సేవా ఫౌండేషన్‌కి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో గ్రామస్తులు ప్రస్తుత సమాజంలో వార్తలే కాదు.. ఇటువంటి వాస్తవాలను నిర్భయంగా వెలికి తీస్తున్న ‘దిశ’ను అభినందిస్తున్నారు.






