- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కేసీఆర్‌కు దమ్ముంటే ఎన్పీఆర్‌ను ఆపాలి’
<p>పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై తెలంగాణ కేబినెట్ చేసిన తీర్మానం ఓ చిత్తుకాగితమనీ, కేసీఆర్‌కు దమ్ముంటే జాతీయ జనగణన పట్టిక(ఎన్పీఆర్)ను ఆపాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి క్రిష్ణ సాగర్ సవాల్ విసిరారు. పట్టణ ఎన్నికలు వస్తేనే మున్సిపాలిటీలు గుర్తొస్తాయనీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలొస్తేనే గ్రామాలు గుర్తొస్తాయనీ, కార్పొరేటర్ ఎన్నికలొస్తేనే గ్రేటర్ హైదరాబాద్ గుర్తొస్తుందని విమర్శించారు. పార్లమెంటు పాస్ చేసిన ఒక చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసే హక్కు కేబినెట్‌కు లేదని తెలిపారు. స్టేట్ ఎగ్జిక్యూటివ్‌లో భాగమైన మంత్రిమండలి […]</p>

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై తెలంగాణ కేబినెట్ చేసిన తీర్మానం ఓ చిత్తుకాగితమనీ, కేసీఆర్‌కు దమ్ముంటే జాతీయ జనగణన పట్టిక(ఎన్పీఆర్)ను ఆపాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి క్రిష్ణ సాగర్ సవాల్ విసిరారు. పట్టణ ఎన్నికలు వస్తేనే మున్సిపాలిటీలు గుర్తొస్తాయనీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలొస్తేనే గ్రామాలు గుర్తొస్తాయనీ, కార్పొరేటర్ ఎన్నికలొస్తేనే గ్రేటర్ హైదరాబాద్ గుర్తొస్తుందని విమర్శించారు. పార్లమెంటు పాస్ చేసిన ఒక చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసే హక్కు కేబినెట్‌కు లేదని తెలిపారు. స్టేట్ ఎగ్జిక్యూటివ్‌లో భాగమైన మంత్రిమండలి చేసిన ఈ నిర్ణయంపై సుమోటోగా స్పందించాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కోరారు. సీఏఏలో మతపరమైన వివక్ష ఎక్కడుందని ప్రశ్నించారు. చదువు రాదా? అసదుద్దీన్ ఏది చెబితే అది వినడమేనా అంటూ మండిపడ్డారు. ‘ఓవైసీలతో కలిసి బిర్యానీ, హలీంలు తినే కేసీఆర్‌కు తెలంగాణలోని హిందూ, జైన, బౌద్ధ, సిక్కు, పార్శీల మనోవేదన ఎలా అర్థమవుతుంది’ అంటూ నిలదీశారు.






