బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు : బండి సంజయ్

by Sridhar Babu |

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ&#8230; తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లా కీలక పాత్ర పోషించిందన్నారు. గతం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌ ప్రజావ్యతిరేక పాలనను చూసి, ప్రజలు విసిగిపోయారన్నారు. అందులో భాగంగా గడీలపాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోటీ చేస్తోందని, ప్రజలు [&hellip;]</p>

BJP leader Bandi Sanjay
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లా కీలక పాత్ర పోషించిందన్నారు. గతం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌ ప్రజావ్యతిరేక పాలనను చూసి, ప్రజలు విసిగిపోయారన్నారు. అందులో భాగంగా గడీలపాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోటీ చేస్తోందని, ప్రజలు బీజేపీని ఆదరించి, అక్కున చేర్చుకుంటున్నారని అన్నారు. ఖమ్మం జిల్లాకు కేంద్ర ప్రభుత్వం రూ. 50.18 కోట్లు నిధులు ఇచ్చిందని తెలిపారు. కేంద్ర నిధులను టీఆర్ఎస్ నాయకులు మింగేస్తున్నారని ఆరోపించారు. భూముల క్రమబద్దీకరణ పేరుతో స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భూములు కొట్టేశారని విమర్శించారు. జిల్లాలో పువ్వాడ అజయ్ రౌడీయిజం చేస్తున్నారని, ఆయన రౌడీయిజానికి భయపడేది లేదని హెచ్చరించారు.

Next Story