పోలీసుల అదుపులో ఉద్యమకారుడు

by Chintha Aamani |

<p>దిశ, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఓ నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రంలో ఆవిర్భావ ఉత్సవాలకు మంగళవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఉద్యమకారుడు రామోజీ ఆంజనేయులు జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో దీక్ష చేపట్టాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నారు.</p>

దిశ, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఓ నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రంలో ఆవిర్భావ ఉత్సవాలకు మంగళవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఉద్యమకారుడు రామోజీ ఆంజనేయులు జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో దీక్ష చేపట్టాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నారు.

Next Story