కంగనా ‘తేజాస్’ టేక్‌ఆఫ్ సూన్ ..

by  |
కంగనా ‘తేజాస్’ టేక్‌ఆఫ్ సూన్ ..
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఏదైనా మాట్లాడితే కచ్చితంగా బాలీవుడ్‌కు వ్యతిరేకంగానే ఉంటుంది. ఈ మధ్య బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ ఇటు సోషల్ మీడియా, అటు మీడియా‌ను కవర్ చేస్తున్న కంగనా.. సుశాంత్ కేసు విషయంలో చాలా యాక్టివ్‌గా రెస్పాండ్ అవుతోంది. ఇన్నాళ్లు అదే పనిలో ఉన్న కంగనా..చాలా రోజుల తర్వాత తన సినిమా అప్ డేట్ ఇచ్చింది.

‘తేజాస్’ మూవీ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కాబోతున్నట్లు ప్రకటించింది. ఇండియన్ ఏయిర్ ఫోర్స్ పైలట్ యూనిఫాంలో గర్వంగా నిలుచున్న లేటెస్ట్ పిక్ షేర్ చేసిన ఆమె..త్వరలో తేజాస్ టేక్ ఆఫ్ కాబోతున్నట్లు తెలిపింది. ఈ లుక్‌పై నెటిజన్ల నుంచి మంచి మార్కులు పడగా, ఇలాంటి కథలో భాగం అయినందుకు సొంతోషంగా ఉన్నట్లు తెలిపింది. ఈ చిత్రం ధైర్యవంతులైన ఏర్ ఫోర్స్ పైలట్స్ అందరికీ అంకితం ఇస్తున్నట్లు తెలిపింది.

ఫిబ్రవరిలో సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా, తాజాగా దీనిపై అప్ డేట్ అందించిన కంగనా..తేజాస్ సినిమా నవతరంలో దేశభక్తిని పెంపొందించేలా రూపుదిద్దుకుంటుంది అని తెలిపింది. సర్వేశ్ మెవారా దర్శకత్వంలో వస్తున్న చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు.

https://www.instagram.com/p/CEa18jVFKFI/?igshid=cykq8jqjkzys



Next Story

Most Viewed