- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం మత్తులో తహసీల్దార్ హల్ చల్.. కారుతో బైకును ఢీకొట్టి..
by Vadlamudi Anukaran |
<p>దిశ, నారాయణఖేడ్ : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ జంట గ్రామమైన మంగల్పేట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న నాగలిగిద్ద తహసీల్దార్ విజయ్ కారు డ్రైవ్ చేస్తూ.. బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు తహసీల్దార్‌ను పట్టుకున్నారు. ఈ ప్రమాదంలో ముఖేష్, అరిఫ్ అనే యువకులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రజలకు చెప్పాల్సిన అధికారి ఇలా మద్యం సేవించి […]</p>

X
దిశ, నారాయణఖేడ్ : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ జంట గ్రామమైన మంగల్పేట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న నాగలిగిద్ద తహసీల్దార్ విజయ్ కారు డ్రైవ్ చేస్తూ.. బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు తహసీల్దార్‌ను పట్టుకున్నారు.
ఈ ప్రమాదంలో ముఖేష్, అరిఫ్ అనే యువకులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రజలకు చెప్పాల్సిన అధికారి ఇలా మద్యం సేవించి రోడ్డు ప్రమాదం చేయడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో తానే బైకును ఢీ కొట్టానని తహసీల్దార్ విజయ్ చెప్పడం గమనార్హం.

Next Story






