- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై మేడిపల్లి పీఎస్‌లో ఫిర్యాదు
by Shyam |
<p>దిశ, డైనమిక్ బ్యూరో : మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షుపై బీజేపీ నేత, తీన్మార్ మల్లన్న తన ట్విట్టర్ అకౌంట్లో విమర్శించాడంటూ టీఆర్ఎస్ నేతలు గత రెండు రోజులుగా విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్నపై కేటీఆర్ అభిమానులు దాడికి దిగిన వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ తీవ్రంగా స్పందిస్తూ మల్లన్నను ముక్కలుగా నరికేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న దీనిపై […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో : మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షుపై బీజేపీ నేత, తీన్మార్ మల్లన్న తన ట్విట్టర్ అకౌంట్లో విమర్శించాడంటూ టీఆర్ఎస్ నేతలు గత రెండు రోజులుగా విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్నపై కేటీఆర్ అభిమానులు దాడికి దిగిన వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ తీవ్రంగా స్పందిస్తూ మల్లన్నను ముక్కలుగా నరికేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న దీనిపై స్పందిస్తూ.. షకీల్, ఆయన అనుచరుల నుంచి ప్రాణాపాయం ఉందని మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. మీడియా ముందే తనను మూడు ముక్కలుగా నరుకుతా అన్న షకీల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
Next Story






