ఇదేం కక్కుర్తి.. ఆటోరిక్షాలో వెళ్తున్న యువతిని కూడా వదలరా..?(వీడియో)

by  |
kiss to girl
X

దిశ, వెబ్‌డెస్క్ : అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు నేటి కుర్రకారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. కొందరు వారి దృష్టిని ఆకర్షించడానికి చేసే స్టంట్స్ మాములుగా ఉండవు. అయితే, కొందరు ఆకతాయిలు మాత్రం నేరుగా వారిని వేధింపులకు గురిచేయడం, పబ్లిక్‌గా టచ్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతారు. ప్రజెంట్ జెనరేషన్‌లో ఇలాంటి ఎన్నో వేధింపులను ప్రత్యక్షంగా, పరోక్షంగా యువతులు, మహిళలు అనుభవిస్తూనే ఉన్నారు. కానీ, ఇటీవల జరిగిన ఓ ఘటన మాత్రం సొసైటీలో అమ్మాయిలు ఎదుర్కొనే మానసిక, లైంగిక దాడులను కళ్లకు కట్టినట్టు చూపుతోంది.

ఆటోరిక్షాలో వెళ్తున్న యువతికి ఓ ఆకతాయి నేరుగా వచ్చి పబ్లిక్‌లో ‘ముద్దు’ పెట్టి వెళ్లిపోతాడు. ఆ దృశ్యాన్ని వెనుకే వస్తున్న అతని మిత్రులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్తా తెగ వైరల్ అయ్యింది. ఈ ఘటన పాకిస్తాన్‌ స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 14న) లాహోర్‌లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.

ఇండిపెండెన్స్ డే రోజు సాయంత్రం కొందరు ఆకతాయిలు పాక్ జాతీయ జెండాలను ధరించి ఆ అమ్మాయి వెళ్తున్న ఆటోరిక్షాను ఫాలో అవుతున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆటోరిక్షా ముందు, చుట్టూ వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో కొంచెం నెమ్మదిగా వెళ్తున్న ఆటో రిక్షా ఫుట్‌బోర్డు ఎక్కిన యువకుడు ఆ యువతి చెంపపై ముద్దు పెట్టి పరిగెత్తగా.. ఆమె పక్కన ఉన్న మరో మహిళ ‘చెప్పల్’ చూపించి వార్నింగ్ ఇచ్చిన దృశ్యాలు వీడియోలో చూడొచ్చు. ఆ తర్వాత బాధిత యువతి ప్రతిఘటించడానికి వాహనం నుంచి దిగేందుకు యత్నిస్తుండగా ఆమెతో ఉన్న వారు నిలువరించారు.

ఇదిలాఉండగా, ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు.. యువతితో ఆకతాయి ప్రవర్తించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‌లో మహిళలపై పెరుగుతున్న దాడులు వారి భద్రత గురించి భయపడే పరిస్థితులు మరింత దిగజారుతున్నట్లు కొందరు కామెంట్స్ చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై పాక్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చాలా మంది సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

Next Story