- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
X chat: ఎలాన్ మస్క్ ఎక్స్ చాట్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?
ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తరవాత ఎలాన్ మస్క్ (Elon Musk) అందులో అనేక అప్డేట్స్ తీసుకువస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్:ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తరవాత ఎలాన్ మస్క్ (Elon Musk) అందులో అనేక అప్డేట్స్ తీసుకువస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్నారు. ట్విట్టర్ పేరును ఎక్స్(X) గా మార్చి దాని పూర్తి స్వరూపాన్నే మార్చేశారు. ఇప్పటికే గ్రోక్ (grook) తీసుకురాగా యూజర్లను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక మస్క్ ఎక్స్ చాట్ (XChat) కూడా ప్రవేశపెట్టబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది ఉపయోగిస్తున్న వాట్సాప్‌కు ఎక్స్ చాట్ (XChat) పోటీ ఇవ్వబోతుందని భావిస్తున్నారు.
ఎక్స్ చాట్ ద్వారా ఫోన్ నంబర్ లేకుండా ఆడియో, వీడియో కాల్స్ చేయవచ్చు. ఇక వారంలోపే ఈ యాప్ అందుబాటులోకి రాబోతుందని సమాచారం. మస్క్ సైతం దీనిపై కీలక ప్రకటన చేశారు. ఎక్స్ చాట్‌లో "ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్, డిసప్పియరింగ్ మెసేజెస్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్స్ చాట్‌ను ఎక్స్ యూజర్ల కోసం రూపొందించారు. ఇది ఇప్పటికే ఉన్న ఎక్స్ ఆప్ డైరెక్ట్ మెసేజింగ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది." అని పేర్కొన్నారు.
XChatలో ఒకరితో ఒకరు పర్సనల్ మెసేజెస్ లేదా గ్రూప్ మెసేజింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో చాట్ చేసిన వెంటనే క్లియర్ అయ్యే ఆప్షన్ కూడా ఉంది. దీనిని ఎంతో ఆకర్షణీయంగా మస్క్ తన మార్క్ చూపించేలా రూపొందించారు. మస్క్ ఎక్స్‌ను అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌కు పోటీ ఇచ్చేందుకు మెరుగులు దిద్దుతున్నారు. దీంతో వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌లు ఎక్స్ పోటీకి తట్టుకోలుగుతాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.






