Robot Dance video: వావ్.. మైఖేల్‌ జాక్సన్‌ను తలపించిన రోబో డ్యాన్స్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-15 14:21:56  IST  )

ప్రస్తుతం రోజు రోజుకీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది.

Robot Dance video: వావ్.. మైఖేల్‌ జాక్సన్‌ను తలపించిన రోబో డ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం రోజు రోజుకీ టెక్నాలజీ (Technology) అభివృద్ధి చెందుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగ ప్రవేశంతో విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో రోబోల (Robots) వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాదు, మనుషుల కంటే వేగంగా పనులు చేస్తుండటంతో ప్రపంచమంతా ఇప్పుడు రోబోల వైపే చూస్తోంది. ఈ క్రమంలో దిగ్గజ టెక్ కంపెనీలన్నీ హ్యూమనాయిడ్ రోబోల తయారీపై దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా ఆప్టిమస్ రోబో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

టెస్లా ఆప్లిమస్ తాజాగా తన ఎక్స్ ఖాతాలో రోబో డ్యాన్స్ చేస్తున్న వీడియోను పంచుకుంది. ఇందులో రోబో ఎలాంటి ఆధారం లేకుండా అచ్చం మనుషుల్లానే అద్భుతంగా నృత్యం చేసింది. మ్యూజిక్‌కు తగినట్లుగా స్టెప్పులు వేస్తూ ప్రతి ఒక్కరి ఆకట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రోబో డ్యాన్స్‌ను ప్రశంసిస్తున్నారు. ఇది మర మనిషా లేదా మైఖైల్ జాక్సనా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Click For Tweet..

Next Story