బంగారం ధర రూ.2 లక్షలకు చేరుకుంటుందా? ట్రేడ్ నిపుణులు ఏం చెబుతున్నారంటే?

by Ajay Maddhiboyina |

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ఏడాదిలోనే బంగారం ధరలు ఏకంగా 50శాతం పెరుగుతూ మగువలకు షాక్ ఇచ్చాయి. వెండి సైతం 55 శాతం పెరిగింది. తాజాగా బంగారం ధర రూ.1,17,570కి చేరుకున్న సంగతి తెలిసిందే. కాగా రాబోయే రోజుల్లో బంగారం ధర రూ.2 లక్షలకు చేరుకుంటుందని వార్తలు వస్తున్నాయి.

బంగారం ధర రూ.2 లక్షలకు చేరుకుంటుందా? ట్రేడ్ నిపుణులు ఏం చెబుతున్నారంటే?
X

దిశ‌, వెబ్ డెస్క్: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ఏడాదిలోనే బంగారం ధరలు ఏకంగా 50శాతం పెరుగుతూ మగువలకు షాక్ ఇచ్చాయి. వెండి సైతం 55 శాతం పెరిగింది. తాజాగా బంగారం ధర రూ.1,17,570కి చేరుకున్న సంగతి తెలిసిందే. కాగా రాబోయే రోజుల్లో బంగారం ధర రూ.2 లక్షలకు చేరుకుంటుందని వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయంగా అమెరికా, ఇంగ్లండ్ లాంటి దేశాలలో ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పుల కారణంగా బంగారంపై పెట్టుబడులు ఎక్కువ అవుతాయని, కాబట్టి బంగారం ధర పెరుగుతుంది కానీ తగ్గే అవకాశమే లేదని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

2020 నుండి 2025 వరకు గోల్డ్ ధర రెట్టింపు అయ్యిందని మరో మూడు నాలుగేళ్లలో ఇది రూ.2 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా వచ్చే ఏడాదే గోల్డ్ ధర మరో 15 నుండి 20 శాతం వరకు పెరగవచ్చని అభిప్రాయపడుతున్నారు. రాబోయే కాలంలోనూ వరల్డ్ ఎకానమీలో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదని, ట్రెండ్ ఇలానే కొనసాగితే కచ్చితంగా బంగారం ధరలు రూ.2లక్షల మార్క్ చేరుకుంటాయని చెబుతున్నారు. అయితే కొంతమంది ప్రస్తుతం బంగారం ధరలు పెరిగాయని, భవిష్యత్ లో తగ్గుతాయని అనుకుంటున్నారు. కానీ ట్రెండ్ ప్రకారం తగ్గే అవకాశమే లేదని ఇంకా పెరుగుతాయి కాబట్టి కొనుగోలు చేయాలని అనుకుంటే ఇదే మంచి సమయం అని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story