- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎవర్రా మీరంతా...? డంపింగ్ యార్డులో పడేసిన చెత్తతో హ్యుమానాయిడ్ రోబో!
డంపింగ్ యార్డులో వృధాగా పడేసిన చెత్త నుంచి ఏకంగా ఒక హ్యూమనాయిడ్ రోబోనే తయారు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: డంపింగ్ యార్డులో వృధాగా పడేసిన చెత్త నుంచి ఏకంగా ఒక హ్యూమనాయిడ్ రోబోనే తయారు చేశారు. ఈ రోబోను రూపొందించింది మాత్రం ఉత్తరప్రదేశ్ లోని కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ విద్యార్థులు. డంపింగ్ యార్డ్ లో వృధాగా ఉన్న పలురకాల తుక్కు సామాగ్రిని ఉపయోగించి, అతి తక్కువ ఖర్చుతో హ్యుమానాయిడ్ రోబోను రూపొందించారు.
అయితే ఈ రోబోకు వీళ్ళు పెట్టిన పేరు అనుష్క. మన దేశ వేద సూత్రాల ప్రేరణతోనే దీని ఇంటెలిజెన్స్ వ్యవస్థను, త్రీడీ ప్రింటెడ్ భాగాలతో ఫేషియల్ ఫీచర్స్ ను తీర్చిదిద్దామని అన్నారు విద్యార్థులు. ఈ రోబోకి భారత్ లోని మేడం టుస్సాడ్స్ బృందం రూపొందించిన ఫ్లెక్సిబుల్ సిలికాన్ స్కిన్ ను తొడిగారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. ప్రపంచంలోనే కొట్టుకునే గుండెను కలిగి ఉన్న తొలి రోబో ఇది. అయితే దీనికి వీళ్ళు పెట్టిన ఖర్చు మాత్రం కేవలం రూ. 2 లక్షలే. ఈ సందర్బంగా ఆ విద్యార్థులు మాట్లాడుతూ.. "ఈ రోబో ఇతర మోడల్స్ లలో ఉండే హ్యుమానాయిడ్ రోబోల తయారీ ఖర్చు కంటే ఇది చాలా తక్కువ అని తెలిపారు. ఈ రోబో ఓపెన్ ఏఐ డేటాబేస్ నుంచి సంగ్రహించిన సమాచారాన్ని వినియోగించుకొని, అనుష్క ప్రస్తుతానికి 61 భాషలు మాట్లాడగలదని వారు తెలిపారు. దీంతో పాటు ఈ అనుష్క 50 రకాల హ్యాండ్ గెశ్చర్స్ ద్వారా వినియోగదారులతో కమ్యూనికేట్ కూడా అవ్వగలదు" అని కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ విద్యార్థులు తెలిపారు.






