వాట్సాప్‌ అప్డేట్.. త్వరలో రాబోయే సరికొత్త ఫీచర్స్ ఇవే!

by Ajay Maddhiboyina |

ప్రముఖ సోషల్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్ త్వరలో మరిన్ని సరికొత్త ఫీచర్లు తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం ఈ అప్డేట్స్ తీసుకురాబోతున్నట్టు సమాచారం.

వాట్సాప్‌ అప్డేట్.. త్వరలో రాబోయే సరికొత్త ఫీచర్స్ ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సోషల్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్ త్వరలో మరిన్ని సరికొత్త ఫీచర్లు తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం ఈ అప్డేట్స్ తీసుకురాబోతున్నట్టు సమాచారం. ఈ అప్డేట్స్ ద్వారా కమ్యూనికేషన్ మరింత సులభం కాబోతుంది. WaBetaInfo నివేదిక ప్రకారం... త్వరలో వాట్సాప్‌లో వాయిస్ మెయిల్‌, ఎమోజీ రియాక్షన్ ప్యానల్, వాయిస్ మెసేజ్ లతో మిస్డ్ కాల్స్ లాంటి ఆప్షన్స్ రాబోతున్నాయి.

ఐఓఎస్ యూజర్ల కోసం వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ రానుంది. మీరు పంపిన వాయిస్ మెయిల్‌కు స్పందించకపోతే మీ స్క్రీన్ పై ఒక ప్రాంప్ట్ కనిపిస్తుంది. అందులో మీరు పంపాలనుకున్న మెసేజ్ ను వెంటనే రికార్డ్ చేసి పంపవచ్చు. ఈ మెసేజ్ మీ చాటింగ్ లో నేరుగా కనిపిస్తుంది. దీని ద్వారా కమ్యూనికేషన్ వేగం పెరుగుతుంది.

ఐఓఎస్ యూజర్లు ఏదైనా సమాచారాన్ని కాపీ చేసేటప్పుడు భారీ సందేశాలను మాత్రమే కాపీ చేయకుండా కేవలం కావాల్సిన సమాచారన్ని మాత్రమే కాపీ చేసుకోవచ్చు. ఒకే ప‌దాన్ని, పేరా గ్రాఫ్‌ను కూడా కాపీ చేసుకునే అప్డేట్ త్వరలో రాబోతుంది.

వాట్సాప్ అకౌంట్ సెంట‌ర్ ద్వారా ఇన్ స్టాగ్రామ్ లింక్ చేసుకునే ఫీచ‌ర్ కూడా మెటా తీసుకురాబోతుంది. ఒక‌సారి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌ను వాట్సాప్‌కు లింక్ చేస్తే వాట్సాప్ ప్రొఫైల్‌లో సోషల్ ఐకాన్ కనిపిస్తుంది. దీని ద్వారా మీ అఫీషియల్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌ను వాట్సాప్ వినియోగదారులు సైతం ఫాలో అవ్వొచ్చు.

ఇకపై ఐఓఎస్ మొబైల్స్‌లో ఎమోజీ రియాక్షన్ పానల్ సరికొత్తగా కనిపించనుంది. కొత్తగా తీసుకురాబోయే లే అవుట్ ప్రస్తుతం ఉన్నదానికంటే చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ ఫీచర్ ఎమోజీలు వినియోగించే యూజర్లకు ఎంతగానో ఉపయోగపడనుంది.

Next Story