Whats App: పిల్లల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్

by velandi.Saikiran |

పిల్లలకు యాడ్స్ లేకుండా కేవలం ఫోన్స్, మెసేజ్లు యాక్సిస్ ఉండేలా పేరెంటు లింక్డ్ అకౌంట్ ఫీచర్ తీసుకువచ్చింది వాట్సాప్.

WhatsApp to allow children under 13 to use messaging service
X

WhatsApp to allow children under 13 to use messaging service

దిశ‌, వెబ్ డెస్క్‌: వాట్సాప్ .. ప్రపంచంలోని నలుమూలల ఈ యాప్ పాకేసింది. మొబైల్ వాడే ప్రతి ఒక్కరు ఈ వాట్సాప్ ( Whats App) వాడుతున్నారు. ఎలాంటి సమాచారం అయినా, వీడియో సందేశాలు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటిని క్షణాల్లోనే ఇతరులకు పంపిస్తున్నారు. అవతలి వ్యక్తి విదేశాల్లో ఉన్న కూడా క్షణాల్లోనే పంపిన సమాచారం వాళ్లకు అందుతోంది. దీంతో వాట్సాప్ కు ఆదరణ విపరీతంగా పెరిగింది. దానికి తగ్గట్టుగానే రకరకాల ఫీచర్స్ తీసుకువస్తుంది వాట్సాప్. జనాలకు అవసరమైన అన్ని ఫీచర్స్ ఇప్పటికే తీసుకువచ్చింది.

పిల్లల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్

చిన్న పిల్లల కోసం అదిరిపోయే ఫీచర్ తీసుకువచ్చింది వాట్సాప్. 13 సంవత్సరాల లోపు పిల్లలకు యాడ్స్ లేకుండా కేవలం ఫోన్స్, మెసేజ్లు యాక్సిస్ ఉండేలా పేరెంటు లింక్డ్ అకౌంట్ ఫీచర్ తీసుకువచ్చింది వాట్సాప్. ఈ అకౌంటు సెటప్ చేసేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పిల్లల ఫోన్ తో పేరెంట్స్ అకౌంట్ లింక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్లు కాంటాక్ట్స్ ను యాడ్, బ్లాక్ లేదా రిపోర్ట్ చేసినా పేరెంట్స్ కు నోటిఫికేషన్ వస్తుంది. ఆరు డిజిట్ పిన్ తో పిల్లలు అకౌంట్ సెట్టింగ్స్ మార్చే యాక్సిస్ తల్లిదండ్రులకు మాత్రమే కల్పించింది వాట్సాప్.


Next Story