- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్సాప్ లో క్రేజీ ఫీచర్..ఇక మనకు నచ్చిన భాషల్లో SMSలు !
వాట్సాప్ మెసేజ్లను.... వాళ్లకు కావాల్సిన భాషలోకి ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. మెటా తీసుకువచ్చిన కొత్త ఫీచర్ మెసేజ్

దిశ, వెబ్ డెస్క్: వాట్సాప్.... ఈ మాట వినని, దీని గురించి తెలియని వారు ఉండరు. చిన్నపిల్లాడి నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఈ వాట్సాప్ వాడుతున్నారు. దీనికి తగ్గట్టుగానే వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్స్... తీసుకువస్తోంది మెటా. ఇలాంటి నేపథ్యంలోనే.. తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ వాట్సాప్ లో వచ్చింది మెటా. ఈ ఫీచర్ సహాయంతో వినియోగదారులు ఇతర భాషలలోని మెసేజ్లను.... వాళ్లకు కావాల్సిన భాషలోకి ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. మెటా తీసుకువచ్చిన కొత్త ఫీచర్ మెసేజ్ ట్రాన్స్ లేషన్. అంటే మనకు హిందీలో వచ్చిన మెసేజ్ ను.. సులభంగా తెలుగులోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఎవరి సహాయం లేకుండా.... ఆ సందేశాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ ఫీచర్ అతి త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. ఐఓఎస్ లో మొత్తం 19 భాషలను ట్రాన్స్ లేట్ చేయగలదు ఈ ఫీచర్. ఇంగ్లీష్, అరబిక్, స్పానిష్ హిందీ భాషలకు ఆండ్రాయిడ్ సపోర్ట్ చేస్తుంది.
అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది?
వాట్సాప్ లో వచ్చిన సందేశాన్ని ట్రాన్స్‌లేట్ చేయాలనుకుంటే.. దానిపై లాంగ్ ప్రెస్ చేయాలి. అనంతరం మనకు ట్రాన్స్‌లేట్ ఫీచర్ కనిపిస్తుంది. అప్పుడు మీకు నచ్చిన భాష లోకి...ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. అయితే ఆండ్రాయిడ్ లో కావాలంటే ఆటోమేటిక్ ట్రాన్స్‌లేట్ ఫీచర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ప్రతి సందేశం ఆటోమేటిగ్గా ట్రాన్స్‌లేట్ అవుతుంది.






