- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్
వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. స్పాయిలర్ మెసేజ్ అనే కొత్త ఫీచర్ తీసుకువచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: వాట్సాప్... పొద్దున లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతీ ఒక్కరూ వినియోగించే సాధనం. మొబైల్ ఉన్న వాళ్లందరూ వాట్సాప్ వాడుతున్నారు. క్షణాల్లో మనం కావాలనుకున్న వాళ్లకు ఈ వాట్సాప్ ద్వారా సందేశాన్ని పంపించవచ్చు. వీడియో కాల్స్ కూడా మాట్లాడుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. అలాంటి వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చింది.
స్పాయిలర్ మెసేజ్ అనే కొత్త ఫీచర్ తీసుకువచ్చారు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తాము పంపే మెసేజ్లు ఏదైనా టెక్స్ట్ ను బ్లర్ చేసి కూడా పంపించుకోవచ్చు అన్నమాట. అవతలి వ్యక్తి ఆ టెక్స్ట్ ను చూడాలంటే దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా బ్లర్ చేసి, పంపడానికి టెక్స్ట్ టైప్ చేసి... కావాల్సిన పదాలపై లాంగ్ ప్రెస్ చేసి స్పాయిలర్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. దీంతో మనం అనుకున్న పదాలు బ్లర్ అవుతాయి. ఇది యూజర్ల ప్రైవసీకి మరో లేయర్ లాగా పనిచేస్తుందని వాట్సాప్ వెల్లడించింది.






