- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MWC 2025: అతిపెద్ద మొబైల్ ఈవెంట్‌కు రంగం సిద్ధం.. లాంచ్ అవుతున్న ఈ కొత్త స్మార్ట్ ఫోన్లపై లుక్కేయండి!
MWC 2025: ఈ ఏడాది అతిపెద్ద టెక్ ఈవెంట్లలో ఒకటైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్(MWC 2025) మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది.

దిశ, వెబ్‌డెస్క్: MWC 2025: ఈ ఏడాది అతిపెద్ద టెక్ ఈవెంట్లలో ఒకటైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్(MWC 2025) మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ మార్చి 3 నుంచి మార్చి 6 వరకు బార్సిలోనా ఫిరా గ్రాన్ వియా(Barcelona Fira Gran Via)లో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు టెక్ కంపెనీలు వారి తాజా ఉత్పత్తులు, ఆవిష్కరణను ఈ ఎండబ్ల్యూసీ 2025(MWC 2025)లో ఆవిష్కరిస్తారు. ప్రతి ఏడాది భవిష్యత్తును నిర్వహించే సాంకేతికతలను ప్రివ్యూ చేసేందుకు ఎండబ్ల్యూసీ సరైన వేదికగా పనిచేస్తుంది. ఈ ఏడాది ఈ ఈవెంట్ ను కన్వర్జ్ థీమ్(Converge Theme) కింద నిర్వహిస్తున్నారు.
ఈ ఈవెంట్లో స్మార్ట్ ఫోన్(Smart phones) లకు మించిన సాంకేతిక పరిజ్నానం ఉన్నప్పటికీ, స్మార్ట్ ఫోన్స్ (Smart phones)ఎక్కువగా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. షియోమీ, శాంసంగ్, నథింగ్ వంటి కంపెనీలు ఈ ఈవెంట్లలో తమ తాజా మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి.
షియోమీ 15 సిరీస్
ఈ ఈవెంట్ లో షియోమీ 15 సిరీస్ ను ఆవిష్కరించనుంది. ఇందులో షియోమీ 15 ఆల్ట్రాపై ప్రత్యేకంగా అందరి ఫోకస్ ఉంది. ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో షియోమీ జోరుగా కొనసాగిస్తూ ఈ డివైజ్ హై ఎండ్ స్పెసిఫికేషన్లు, పవర్ ఫుల్ కెమెరాలను అందిస్తుందని భావిస్తున్నారు.
నథింగ్ ఫోన్ 3ఏ, నథింగ్ 3ఏ ప్రో
క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ నడిచే నథింగ్ ఫోన్ 3ఏ సిరీస్ కూడా ఈ ఈవెంట్లో రానుంది. ఈ సిరీస్ లో నథింగ్ ఫోన్ 3ఏ, నథింగ్ ఫోన్ 3ఏ ప్రో అనే రెండు మోడళ్లు ఉండనున్నాయి. ఈ రెండు డివైజ్ లు నథింగ్ ఫోన్ సిగ్నేచర్ డిజైన్స్ ను కలిగి ఉంటాయి. ఇవి మార్చి 4న అధికారికంగా లాంచ్ కానున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్
గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్లో మొదట ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ ను ఎండబ్ల్యూసీ 2025లో మళ్లీ ప్రదర్శించనున్నారు. ఈ ఫోన్ అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న లాంచ్ లలో ఒకటిగా నిలిచింది.
హెచ్ఎండీ, హానర్ స్మార్ట్ ఫోన్స్
హెచ్ఎండీ గ్లోబల్, హానర్ కంపెనీలు కూడా ఎండబ్ల్యూసీలో కొత్త మోడళ్లను ప్రదర్శిస్తున్నాయి. ఇది ఈ ఈవెంట్ చుట్టూ ఉన్న ఉత్సాహాన్ని పెంచుతుంది.
ఎండబ్ల్యూసీ 2025కు ఎలా హాజరవ్వాలి?
ఈ ఎండబ్ల్యూసీ 2025లో పాల్గొనడానికి ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకునేందుకు అధికారిక ఎండబ్ల్యూసీ బార్సిలోనా వెబ్ సైట్ కు వెళ్లి మీ పాస్ సెలక్ట్ చేసుకోండి. అవసరమైన వివరాలను అందించండి. రిజిస్ట్రేషన్ తర్వాత మీ డిజిటల్ పాస్ యాక్సెస్ చేసేందుకు మీరు ఎండబ్ల్యూసీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.






