- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
10000mAh బ్యాటరీతో వివో ఫోన్..క్రేజీ ఫీచర్స్, ధర వివరాలు ఇవే
10000mAh బ్యాటరీతో వివో నుంచి Y600 Pro పేరుతో కొత్త ఫోన్ రాబోతుంది.

దిశ, వెబ్ డెస్క్: వివో మొబైల్స్ సేల్స్ క్రమ క్రమంగా పెరిగిపోతున్నాయి. ఇండియాలో ఈ మొబైల్స్ కు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో రకరకాల మోడల్స్ లాంఛ్ అవుతున్నాయి. ఇక లేటెస్ట్ గా వివో నుంచి మరో కొత్త ఫోన్ రాబోతున్నట్లు ప్రకటన విడుదలైంది. వివో వై600 ప్రో ( Vivo Y600 Pro) పేరుతో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలోకి రాబోతోంది. వచ్చే మే లేదా జూన్ లో చైనాలో ఈ మొబైల్ లాంచ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇండియాలో మాత్రం జూలై నాటి వరకు రాబోతోంది.
ఈ Vivo Y600 Pro ఫీచర్స్, ధర వివరాలు
వివో వై600 ప్రో పేరుతో లాంచ్ అవుతున్న ఈ కొత్త మొబైల్ 1000 mah బ్యాటరీ సామర్థ్యంతో రానుంది. 120w ఫాస్ట్ ఛార్జర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 6.78 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లేతో రాబోతోంది. స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్ సెట్ ఇందులో వాడినట్లు తెలుస్తోంది. మెయిన్ కెమెరా 200 ఎంపీ ఉండనుండగా సెల్ఫీల కోసం 50 MP కెమెరా అందిస్తున్నారు. ఈ మొబైల్ ధర ఇండియాలో రూ. 35 వేల నుంచి రూ. 45 వేల మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి.






