రూ. 1,500 వరకు క్యాష్‌బ్యాక్‌‌తో 'Vivo Y100' స్మార్ట్ ఫోన్‌

by Disha Web Desk 17 |
రూ. 1,500 వరకు క్యాష్‌బ్యాక్‌‌తో Vivo Y100 స్మార్ట్ ఫోన్‌
X

దిశ, వెబ్‌డెస్క్: Vivo కంపెనీ తన Y-సిరీస్‌లో భాగంగా 'Vivo Y100' స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. 8GB RAM + 128GB స్టోరేజ్ ఉన్న ఏకైక వేరియంట్ ధర రూ. 24,999. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్ ద్వారా ఫిబ్రవరి 16 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఫోన్ పసిఫిక్ బ్లూ, ట్విలైట్ గోల్డ్, మెటల్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో వస్తుంది. వినియోగదారులు కోటక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బ్యాంకుల ద్వారా కొనుగోలు చేసినట్లయితే రూ. 1,500 వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.



Vivo Y100 5G స్పెసిఫికేషన్లు

* 6.38-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్.

* డిస్ప్లే HDR10+ సర్టిఫికేషన్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌.

* 6nm ప్రాసెస్ ఆధారంగా ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 900 SoC చిప్‌సెట్.

* Android 13 ఆధారంగా సరికొత్త FunTouch OS 13లో రన్ అవుతుంది.

* బ్యాక్ సైడ్ 64 MP+ 2 MP కెమెరాలు ఉన్నాయి.

* ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది.

* 44W ఫాస్ట్ చార్జింగ్‌తో 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది.




Next Story

Most Viewed