Vivo నుంచి రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్ ‘X90s’

by Disha Web Desk 17 |
Vivo నుంచి రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్ ‘X90s’
X

దిశ, వెబ్‌డెస్క్: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ Vivo కొత్తగా X90s అనే స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. దీని ఫీచర్స్ గురించి కొన్ని నివేదికలు బయటకు వచ్చాయి. ఈ నివేదికల ప్రకారం, ఫోన్ 2,800 x 1,280 పిక్సెల్‌ల 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల వంపు ఉన్న AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. MediaTek డైమెన్సిటీ 9200+ SoC ప్రాసెసర్ ద్వారా పనిచేసే అవకాశం ఉంది.

వెనక ప్రైమరీ 50-మెగాపిక్సెల్, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 2x ఆప్టికల్ జూమ్‌తో 12-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరాలు ఉండనున్నాయి. సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉండనుంది. Android 13, OriginOS 3 ఆధారంగా రన్ అవుతుంది. ఫోన్ 8GB RAM+256GB స్టోరేజ్, 12GB RAM+256GB స్టోరేజ్,12GB RAM+512GB స్టోరేజ్‌ వేరియంట్లలో లభించే అవకాశం ఉంది. 120W వైర్డ్ చార్జింగ్‌తో 4810mAh బ్యాటరీని అందించనున్నారు. ఈ ఫోన్ కేవలం 8 నిమిషాల్లో 50 శాతం వరకు చార్జ్ అవుతుంది.

Read More..

Samsung Galaxy Tab S9 Series : Samsung కొత్త ట్యాబ్‌లు



Next Story

Most Viewed