Vivo X300 FE: 5,500mAh బ్యాటరీతో వివో ఫోన్‌..ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే

by velandi.Saikiran |

వివో X300 FE ( Vivo X300 FE) పేరుతో వచ్చే నెలలో కొత్త ఫోన్ లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది.

Vivo X300 FE: 5,500mAh బ్యాటరీతో వివో ఫోన్‌..ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల మొబైల్స్ వస్తున్నాయి. ఇందులో మిడిల్ క్లాస్ నుంచి మొదలుకొని హై క్లాస్ వాళ్ళు కూడా కొనుగోలు చేసే ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. అయితే ఈ క్రమంలో ఇప్పుడు వివో కంపెనీ నుంచి సరికొత్త మొబైల్ రాబోతోంది. వివో X300 FE ( Vivo X300 FE) పేరుతో వచ్చే నెలలో కొత్త ఫోన్ లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఇందులో కెమెరాకు ప్రధాన్య‌త‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మే మాసంలో రిలీజ్ కాబోతున్న ఈ ఫోన్ ఫీచర్లు ఒకసారి పరిశీలిద్దాం.

Vivo X300 FE ఫీచ‌ర్స్‌, ధ‌ర ఎంతంటే ?

6.78 అంగుళాల డిస్ప్లే కలిగి ఉన్న వివో X300 FE ఫోన్, 120 HZ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇందులో ప్రధాన కెమెరా 50 ఎంపీ, 50 ఎంపీ ఆల్ట్రా వైడ్, మరో 50 ఎంపీ పెరిస్కోప్ టెలిఫోన్ లెన్స్ ఉంటాయి. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5500 mah. 100W ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇండియాలో ఈ మొబైల్ ధర రూ. 55000 నుంచి రూ. 65 వేల మధ్య ఉండే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

Next Story