- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
6500mAh బ్యాటరీతో వివో నుంచి రెండు కొత్త ఫోన్లు..ధర, ఫీచర్స్ ఇవే
వివో నుంచి మరో రెండు ఫోన్లు వచ్చాయి. వివో V70, V70 ఎలైట్ భారతదేశంలో అధికారికంగా లాంఛ్ అయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వివో కు చెందిన ఫోన్స్ కు భారతదేశంలో మంచి గిరాకీ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ప్రతినెల ఏదో ఒక కొత్త మోడల్ ఫోన్ వివో నుంచి వస్తుంది. అయితే తాజాగా వివో నుంచి V70 సిరీస్ లో భాగంగా వివో V70, V70 ఎలైట్ ఫోన్స్ మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి. ఈ మేరకు కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. అలాగే ఈ మొబైల్ కు సంబంధించిన ఫోటోలు, ఫీచర్స్, ధర వివరాలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఇందులో vivo V70 ఫోన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.59 అంగుళాలు ఉంటుంది. 1.5K 120Hz OLED డిస్ ప్లే కలిగి ఉండనుంది.మ 50MP(Main) + 50MP (Telephoto) + 8MP(UW) ZEISS కెమెరా రానుంది. 50MP ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు. 6500mAh బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ మార్కెట్ వచ్చింది. 90W Wired ఛార్జర్ సపోర్ట్ చేయనుంది. vivo V70 8GB + 256GB మోడల్ ధర Rs.45,999గా ఉండనుందట. అటు vivo V70 Elite ఫీచర్స్ దాదాపు అలాగే ఉంటాయి. కానీ vivo V70 Elite ధర ఎక్కువ అని సమాచారం. vivo V70 ఎలైట్ 8GB + 256GB మోడల్ ధర Rs.51,999గా ఫిక్స్ చేశారట.






