- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేవలం రూ.30వేలకే vivo V60e.. 200 మెగాపిక్సల్ కెమెరాతో పాటు ఇతర ఫీచర్స్ ఇవే!
ఆండ్రాయిడ్‌లో కెమెరా పర్ఫామెన్స్‌తో పోటీ పడే ఫోన్లలో vivo ముందు వరుసలో ఉంటుంది. ఇది మార్కెట్ లో బెస్ట్ కెమెరాలను అందించే ఆండ్రాయిడ్ ఫోన్లకు ప్రస్తుతం గట్టి పోటీ ఇస్తోంది. అడ్వాన్స్డ్ ఫోటోగ్రఫీపైనే ఈ బ్రాండ్ ఎక్కవ ఫోకస్ పెట్టింది.

దిశ, వెబ్ డెస్క్: ఆండ్రాయిడ్‌లో కెమెరా పర్ఫామెన్స్‌తో పోటీ పడే ఫోన్లలో vivo ముందు వరుసలో ఉంటుంది. ఇది మార్కెట్ లో బెస్ట్ కెమెరాలను అందించే ఆండ్రాయిడ్ ఫోన్లకు ప్రస్తుతం గట్టి పోటీ ఇస్తోంది. అడ్వాన్స్డ్ ఫోటోగ్రఫీపైనే ఈ బ్రాండ్ ఎక్కవ ఫోకస్ పెట్టింది. ఇక రీసెంట్ గా కేవలం రూ.30వేలకే 200 మెగాపిక్సల్ కెమెరాతో vivo V60eని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇతర ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ కూడా ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. ఇందులో 8 GB RAM ఉండగా 128 GB ఇంటర్నల్ మెమోరీ ఉంది.
దీని పొడవు 17.2 cm కాగా 6.77 ఇంచుల Full HD+ Display లభిస్తోంది. అదే విధంగా కెమెరా విషయానికి వస్తే డ్యూయల్ కెమెరా సెటప్ తో 200MP + 8MP రేర్ కెమెరా ఉంది. అదే విధంగా 50MP Front Camera ఉంది. రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా రెండు కూడా 4k వీడియో రికార్డింగ్, ఫోటోగ్రఫీకి సపోర్ట్ చేస్తాయి. దీని రేర్ కెమెరాతో పోర్టరేట్ ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఏఐ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.
అదే విధంగా ఇందులో 6500 mAh బ్యాటరీ ఉంది. ఎక్కవ కాలం చార్జింగ్ నిలిచి ఉండటంతో పాటు ఫాస్ట్ చార్జింగ్ కు ఇది సపోర్ట్ చేస్తుంది. Dimensity 7360-Turbo Processor ద్వారా ఈ ఫోన్ పనిచేస్తుంది. ఎలైట్ పర్పుల్, నోబల్ గోల్డ్ రంగుల్లో ఇది లభిస్తుంది. పూర్తిగా ఇది వాటర్ రెసిస్టెంట్ కావడం వల్ల నీటిలో పడినా ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. ఒకవేళ దీపావళికి మీరు కలర్ ఫుల్ ఫోటోలు దిగాలని అనుకుంటే ఈ ఫోన్ కొనుగోలు చేయడం మంచి నిర్ణయం అవుతుంది.






