vivo V60e : వీవో నుంచి అదిరిపోయే ఫోన్‌..ఏఐ ఫీచ‌ర్స్‌, ధ‌ర, ఫీచ‌ర్స్ ఇవే !

by velandi.Saikiran |

ఇండియన్ మార్కెట్ లో రకరకాల మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే వివో నుంచి సరికొత్త మొబైల్ లాంచ్

vivo V60e : వీవో నుంచి అదిరిపోయే ఫోన్‌..ఏఐ ఫీచ‌ర్స్‌, ధ‌ర, ఫీచ‌ర్స్ ఇవే !
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఇండియన్ మార్కెట్ లో రకరకాల మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే వివో నుంచి సరికొత్త మొబైల్ లాంచ్ అయింది. వివో v60ఈ ( Vivo V60e 5G) పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చింది కంపెనీ. ఈ మొబైల్ 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే 200 మెగాపిక్సల్ కెమెరా కూడా అందిస్తున్నారు. సెల్ఫీ కెమెరా కోసం 50 మెగాపిక్సల్ కంపెనీ ఆఫర్ చేస్తోంది.

ఆండ్రాయిడ్ 15 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 15 సిస్టంతో పనిచేస్తుంది. 6.77 అంగుళాల డిస్ప్లే కూడా అందిస్తున్నారు. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే ఈ మొబైల్ ఫోన్ కు సపోర్ట్ చేస్తుంది. 8gb + 128gb మోడల్ ఫోన్ ధర 30 వేలుగా ఫిక్స్ చేశారు. 8gb + 250 జీబీ మోడల్ మొబైల్ ధర 32 వేల రూపాయలుగా ఉంది. ఎలైట్ పర్పుల్, నోబుల్ గోల్డ్ కలర్స్ లో ఈ మొబైల్ ఫోన్ లభిస్తుంది. రిటైల్‌ స్టోర్ లో ఇప్పటికే అందుబాటులోకి ఈ మొబైల్ వచ్చిందని కంపెనీ వెల్లడించింది.

Next Story