సూర్యరశ్మి ఆధారంగా కలర్ మారే సరికొత్త Vivo స్మార్ట్ ఫోన్

by Disha Web Desk 17 |
సూర్యరశ్మి ఆధారంగా కలర్ మారే సరికొత్త Vivo స్మార్ట్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ Vivo తన కొత్త మోడల్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. కొత్త వేరియంట్ పేరు 'Vivo V25 Pro'. 5G నెట్‌వర్క్‌‌, 66W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. ఇది ప్రత్యేకంగా సూర్యరశ్మి ఫోన్ వెనుక ప్యానెల్‌పై పడినప్పుడు దాని కలర్ మారే కొత్త ఫీచర్‌ను కలిగి ఉంది. 8GB RAM + 128GB బేస్ వేరియంట్ ధర రూ. 35,999. 12GB RAM + 256GB స్టోరేజ్‌ టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 39,999. ఇది ప్యూర్ బ్లాక్, సెయిలింగ్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.



స్మార్ట్ ఫోన్ ఆగస్టు 25వ తేదీ నుండి ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్‌లైన్ స్టోర్, ఇతర రీటైల్ స్టోర్‌ల ద్వారా అమ్మకానికి రానుంది. ప్రీ-బుకింగ్ చేసుకునే కస్టమర్‌లకు HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్, EMI లపై రూ. 3,500 తగ్గింపు పొందవచ్చు. అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా ఉంది.



Vivo V25 Pro స్పెసిఫికేషన్స్

* Full-HD+ (2,376x1,080 పిక్సెల్‌లు) రిజల్యూషన్‌తో 6.56-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్.

* FunTouch OS 12.1 Android 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా నడుస్తుంది.

* స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 1300 SoCతో పాటు 12GB వరకు RAMని కలిగి ఉంది.

* Vivo V25 Pro ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

* ఫోన్ బ్యాక్ సైడ్ 64 MP+ 8 MP+ 2 MP కెమెరాలు ఉన్నాయి.

* ముందు వైపు సెల్ఫీల కోసం 32 MP కెమెరా ఉంది.

* ఇది 66W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4,830mAh బ్యాటరీని అందిస్తుంది.

* Vivo V25 Pro రంగు మారే ఫ్లోరైట్ AG గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంది.

* మంచి గేమింగ్ అనుభవం కోసం ప్రత్యేక డిజైన్ కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.

ఇవి కూడా చదవండి : సరికొత్త ఫీచర్స్‌తో, బడ్జెట్ ధరలో లాంచ్ అయిన Realme కొత్త మోడల్


Next Story

Most Viewed