Vivo T5 Pro 5G: 9,020mAh బ్యాట‌రీతో వివో ఫోన్‌..ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే

by velandi.Saikiran |

వివో టి5 ప్రో 5G ( Vivo T5 Pro 5G ) పేరుతో ఈ మొబైల్ ను ఏప్రిల్ 15వ తేదీన ఇండియా వ్యాప్తంగా లాంచ్ చేయనున్నారు.

Vivo T5 Pro 5G India launch set for April 15th, design revealed
X

Vivo T5 Pro 5G India launch set for April 15th, design revealed

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియన్ మార్కెట్ లో వివో కంపెనీకి మంచి పాపులారిటీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీకి సంబంధించిన ఫోన్లను కొనుగోలు చేసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మిడిల్ క్లాస్ వాళ్లు కూడా కొనుగోలు చేసేలా ఈ కంపెనీ నుంచి చాలా ఫోన్లు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ఇక ఈ క్రమంలో వివో నుంచి మరో కొత్త ఫోన్ రాబోతోంది. వివో టి5 ప్రో 5G ( Vivo T5 Pro 5G ) పేరుతో ఈ మొబైల్ ను ఏప్రిల్ 15వ తేదీన ఇండియా వ్యాప్తంగా లాంచ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది కంపెనీ.

Vivo T5 Pro 5G ఫోన్ ఫీచర్స్, ధర

ఏప్రిల్ 15వ తేదీన రిలీజ్ కాబోతున్న Vivo T5 Pro 5G ఫోన్ 6.78 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 7 gen 3 ఇందులో ఉంటుంది. ఈ మొబైల్ బ్యాక్ కెమెరా 50 ఎంపీతో పాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఒక సెల్ఫీల కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందిస్తున్నారు. ఈ ఫోన్ కు 90W ఛార్జ‌ర్ మాత్ర‌మే స‌పోర్ట్ చేయ‌నుంది. 9020mAh బ్యాట‌రీ అందిస్తున్నారు. 8.25mm స‌న్నగా ఉంటుంది.ఇక ఈ ఫోన్ ధ‌ర రూ.36,999 గా ఉండ‌నుందని సమాచారం.

Next Story