- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vivo T5 Pro 5G: 9020mAh బ్యాటరీపై రూ.3000 డిస్కౌంట్..ధర ఎంతంటే
వివో T5 ప్రో 5G ( Vivo T5 Pro 5G) స్మార్ట్ ఫోన్ సేల్స్ ప్రారంభమయ్యాయి. 8gb+128gb స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ రూ.29,999గా ఉంది.

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్ లో వివో కంపెనీకి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. మిడిల్ క్లాస్ వాళ్ళను అట్రాక్ట్ చేసేలా ఈ కంపెనీ నుంచి ఫోన్స్ లాంచ్ అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే వివో తన క్రేజ్ ను ఇండియాలో భారీగా పెంచుకుంది. అయితే ఈ కంపెనీ నుంచి తాజాగా విడుదలైన వివో T5 ప్రో 5G ( Vivo T5 Pro 5G) స్మార్ట్ ఫోన్ సేల్స్ ప్రారంభమయ్యాయి. 8gb+128gb స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ రూ.29,999గా ఉంది.
8gb+256gb స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ రూ.33,999గా ఉంది. 12gb+256gb స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ రూ.39,999గా ఉంది. ఈ ఫోన్స్ కొనుగోలు చేసేటప్పుడు ఎస్బిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ లాంటి బ్యాంకు కార్డులు వాడితే రూ.3,000 వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.3000 నుంచి రూ.5000 వరకు బోనస్ పొందవచ్చు.
ఈ Vivo T5 Pro 5G మొబైల్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే... 9029mah బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ వచ్చింది. అంటే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే రెండు రోజులు వాడుకోవచ్చు. 6.83 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉన్న ఈ ఫోన్ కు 90 W ఫాస్ట్ చార్జర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 37 నిమిషాలలో 50 శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. బ్యాక్ కెమెరా 50 ఎంపీ కాగా, సెల్ఫీల కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు. బ్లూ, బ్లాక్ లాంటి కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.






