- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIVO T4: 26వేల ఫోన్ రూ.18వేలకే.. ఫ్లిప్ కార్ట్ బిగ్ బాంగ్ దివాళీ సేల్‌లో క్రేజీ ఆఫర్
దసరా ముందు ప్రారంభమైన ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసిపోయింది. కాగా ఇప్పుడు దీపావళి సందర్భంగా అక్టోబర్ 11వ తేదీ నుండి బిగ్ బాంగ్ దివాళీ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ లో పలు వస్తువులు చాలా తక్కువ ధరకే రానున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: దసరా ముందు ప్రారంభమైన ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసిపోయింది. కాగా ఇప్పుడు దీపావళి సందర్భంగా అక్టోబర్ 11వ తేదీ నుండి బిగ్ బాంగ్ దివాళీ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ లో పలు వస్తువులు చాలా తక్కువ ధరకే రానున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్స్ ఉండనున్నాయి. ఈ నేపథ్యంలోనే స్లిమ్మెస్ట్ ఫోన్ VIVO T4పై భారీ ఆఫర్ ప్రకటించారు.
ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.26వేలు కాగా సేల్ లో రూ.18వేలకే రానుంది. బిగ్ బాంగ్ సేల్ ప్రారంభమైన తరవాత ఈ ధర అందుబాటులో ఉంటుంది. VIVOలోని స్లిమ్మెస్ట్ ఫోన్ కావడంతో దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతే కాకుండా తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు వస్తుండటంతో ఈ ఫోన్ కొనుగోలు చేయాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ ఫోన్ ఫీచర్స్ చూసినట్లయితే ఇందులో 8 GB RAM, 128 GB ఇంటర్నల్ మెమోరీ ఉన్నాయి.
6.77 ఇంచుల డిస్ ప్లే ఉంది. అదే విధంగా 50MP (OIS) + 2MP రేర్ కెమెరా ఇందులో ఉంది. దీంతో పాటు 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. ఈ ఫోన్ రేర్ కెమెరా ద్వారా పోర్టరేట్ ఫోటోలు సైతం తీసుకోవచ్చు. అంతే కాకుండా ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సల్ ఉండటంతో సెల్ఫీలు సైతం క్లారిటీగా తీసుకోవచ్చు. ఇక ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 7300 mAh బ్యాటరీ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో Snapdragon 7s Gen 3 5G Processor ఉండటం ద్వారా వేగంగా పనిచేస్తుంది.






