ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి Vivo 5G స్మార్ట్ ఫోన్

by Disha Web Desk 17 |
ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి Vivo 5G స్మార్ట్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: Vivo కంపెనీ నుంచి భారత మార్కెట్లోకి కొత్తగా స్మార్ట్ ఫోన్ రానుంది. ఈ మోడల్ పేరు ‘Vivo T2 5G’. ఇది ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఫోన్ పూర్తి-HD+ AMOLED డిస్‌ప్లే, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 రన్ అవుతుందని సమాచారం. అలాగే, స్నాప్‌డ్రాగన్ 695 5G SoC ద్వారా పనిచేస్తుంది. ఫొటోలు, వీడియోల కోసం 64-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు, 2MP కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీల కోసం ముందు 16MP కెమెరా ఉండనుంది. బ్యాటరీ పరంగా 4700mAh ని అందించినట్లు సమాచారం. ఇతర పూర్తి వివరాలు లాంచ్ టైంలో తెలుస్తాయి.





Next Story

Most Viewed