- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివో కొనుగోలుదారులకు షాక్.. రూ.4000 వరకు ధరల పెంపు!
వివో కొనుగోలుదారులకు షాక్.. ఒక్కో ఫోన్ పై రూ.4000 వరకు ధరలు పెంచారు.

దిశ, వెబ్ డెస్క్: వివో వినియోగదారులకు ఊహించని షాక్ తగిలింది. చైనాకు చెందిన ఈ వివో కంపెనీ తన మొబైల్స్ ధరలను అమాంతం పెంచింది. ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ పై వెయ్యి రూపాయల నుంచి రూ. 4 వేల వరకు ధరలు పెంచింది. ఇందులో వివో T5x, V70, V70 elite, y31,y51 pro, y400 5జీ మోడల్స్ ఉన్నాయి.
ధరలు పెరగడం వెనుక కారణం ఇదే
పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా కరెన్సీ హెచ్చుతగ్గులు, మొబైల్ తయారీ విడిభాగాల ధర అమాంతం పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది వివో. ఇటీవల శాంసంగ్ కూడా తమ మొబైల్స్ ధరలను పిలిచింది. ఇప్పుడు వివో కూడా ఆ లిస్టులో చేరిపోయింది. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచే కొనసాగనున్నాయి.
వీవో T5x మోడల్ ఫోన్ ధర రూ.18,999 ఉండేది. కానీ ఇప్పుడు రూ.4 వేలు పెరిగి, రూ. 22,999కు చేరింది. ఇందులో మరో రెండు వేరియంట్స్ ఉంటాయి. V70 Eliteపైన రూ.4 వేలు పెరిగింది. దీంతో ఈ ఫోన్ ధర రూ.55,999కు చేరింది. V70పై రూ.4 పెరిగింది. దీంతో ఈ మొబైల్ ధర రూ.53,999కు చేరింది. అటు Y400, Y51 Pro మోడల్స్ పై 3 వేలు పెరుగా, Y31 5Gపై వెయ్యి రూపాయలు పెరిగింది. క్లిక్






