ఇన్‌స్టా, టిక్‌టాక్‌కు పోటీగా వీరీల్స్.. ఇక్కడ వీడియోలతో పాటు మరెన్నో

by Ajay Maddhiboyina |

టిక్ టాక్ ఒక‌ప్పుడు ఇండియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యాప్. వాట్సాప్ ఎలా అయితే క‌చ్చితంగా ఫోన్ లో ఉండేదో టిక్ టాక్ కూడా అలానే డౌన్ లోడ్ చేసుకున్నారు. టిక్ టాక్ బ్యాన్ అవ్వ‌డంతో ఇన్ స్టాలోనే రీల్స్ ఆప్ష‌న్ రావ‌డంతో దానికి అల‌వాటుప‌డ్డారు.

ఇన్‌స్టా,  టిక్‌టాక్‌కు పోటీగా వీరీల్స్.. ఇక్కడ వీడియోలతో పాటు మరెన్నో
X

దిశ‌, వెబ్ డెస్క్: టిక్ టాక్ ఒక‌ప్పుడు ఇండియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యాప్. వాట్సాప్ ఎలా అయితే క‌చ్చితంగా ఫోన్ లో ఉండేదో టిక్ టాక్ కూడా అలానే డౌన్ లోడ్ చేసుకున్నారు. టిక్ టాక్ బ్యాన్ అవ్వ‌డంతో ఇన్ స్టాలోనే రీల్స్ ఆప్ష‌న్ రావ‌డంతో దానికి అల‌వాటుప‌డ్డారు. కాగా ఈ రెండు యాప్స్ కు పోటీ ఇచ్చేలా Vreels అనే మ‌రో యాప్ వ‌చ్చేసింది. Vreels అంటే (Virtually Relax, Explore, Engage, Live & Share) అని అర్థం. అమెరికాలో నివ‌సించే తెలుగు ఇంజ‌నీర్లే దీనిని సృష్టించారు. 22 దేశాల్లో విడుద‌లైన ఈ యాప్ ప్రస్తుతం బీటా ద‌శ‌లో ఉంది.

ఇక ఇందులో టిక్ టాక్, ఇన్ స్టా గ్రామ్ కు మించిన అనుభూతి క‌లిగించేలా ఎన్నో ఆప్ష‌న్స్ ఉన్నాయి. Vreelsలో రీల్స్ చూడ‌టంతో పాటు చాటింగ్, ఫోటోలు షేర్ చేయ‌డం, స్టోరీస్ షేర్ చేయ‌వ‌చ్చు. అంతే కాకుండా ఇందులో షాపింగ్ కూడా చేయ‌వ‌చ్చు. దీనిలో లొకేష‌న్ పంచుకునేందుకు వీ మ్యాప్, భావోద్వేగాల‌ను ఇత‌రుల‌తో పంచుకోవ‌డానికి వీ క్యాప్సుల్స్ లాంటి ఆప్ష‌న్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా వీరీల్స్ షాప్ ఆప్ష‌న్ ద్వారా వ‌స్తువుల‌ను అమ్మ‌డం కొన‌డం చేయ‌వ‌చ్చు. ఈ యాప్ డౌన్ లోక్ చేసుకోవాల‌ని అనుకుంటే www.vreels.com ను సంద‌ర్శించండి.

Next Story