- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గూగుల్ ‘AI’ సెర్చ్‌పై యూజర్ల తిరుగుబాటు.. పాత సెర్చ్ విధానం వైపు నెటిజన్ల మొగ్గు!
గూగుల్ సెర్చ్‌లో ఏఐ (AI) సెర్చ్ రిజల్ట్స్‌పై ఇంటర్నెట్ వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సెర్చ్ ఇంజిన్ దిగ్గజం ‘గూగుల్’ (Google) తన వినియోగదారులపై బలవంతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను బలవంతంగా రుద్దడంపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గూగుల్ క్రమంగా తన నార్మల్ సెర్చ్ రిజల్ట్స్ స్థానంలో ‘ఏఐ ఓవర్‌వ్యూస్’ (AI Overviews) ని ప్రవేశపెడుతూ, యూజర్ అడిగిన ప్రశ్నకు ఏఐ ద్వారా జనరేట్ చేసిన సమాధానాన్ని టాప్‌లో చూపిస్తోంది. అయితే, ఈ ఏఐ సమాధానాలు తప్పులతడకగా ఉండటం, వెబ్‌సైట్ లింకులను వెతుక్కోవడం కష్టంగా మారడంతో యూజర్లు ఇప్పుడు గూగుల్ ఏఐపై తిరుగుబావుట ఎగురవేస్తున్నారు.
వామ్మో ‘ఏఐ’ మాకొద్దు బాబోయ్..
గూగుల్ సెర్చ్‌లో ఏఐ ప్రమేయం లేకుండా కేవలం పాత పద్ధతిలో వెబ్‌సైట్ లింకులు మాత్రమే వచ్చేలా చూసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. ఇందులో భాగంగా టెక్ ప్రియులు కొన్ని ప్రత్యేకమైన ట్రిక్స్, టూల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. గూగుల్ సెర్చ్ చేసిన తర్వాత అందులో వచ్చే ‘More’ ఆప్షన్‌లోకి వెళ్లి ‘Web’ ఫిల్టర్ క్లిక్ చేయడం ద్వారా ఏఐ బాక్స్‌లు, ఇమేజ్‌లు లేకుండా కేవలం పాత తరహా టెక్స్ట్ లింకులను మాత్రమే పొందుతున్నారు. అదేవిధంగా గూగుల్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్లలో గూగుల్ ‘ఏఐ ఓవర్‌వ్యూస్’ను పూర్తిగా బ్లాక్ చేసేందుకు డెవలపర్లు ప్రత్యేకంగా తయారు చేసిన థర్డ్-పార్టీ ఎక్స్‌టెన్షన్లను నెటిజన్లు భారీగా డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. మరికొందరు గూగుల్ ఏఐ ఇబ్బంది తాళలేక యూజర్లు డక్‌డక్‌గో వంటి ప్రైవసీ ఆధారిత, ఏఐ లేని ఇతర సెర్చ్ ఇంజిన్లను ఆశ్రయిస్తున్నారు.
తగ్గుతున్న యూజర్ ఎక్స్‌పీరియన్స్..
ప్రపంచవ్యాప్తంగా యూజర్ల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నా.. ‘ఏఐ ఓవర్‌వ్యూస్’ ఫీచర్‌ను పూర్తిగా డిసేబుల్ చేసుకునేందుకు గూగుల్ ఎలాంటి డైరెక్ట్ సెట్టింగ్‌ను ఇవ్వలేదు. ఫ్యూచర్ అంతా ఏఐదే అని గూగుల్ బలంగా నమ్ముతుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే, యూజర్లు మాత్రం తమకు ఖచ్చితమైన సమాచారం ఇచ్చే ఒరిజినల్ వెబ్‌సైట్ లింకులే ముద్దని తేల్చి చెబుతున్నారు.






