మెటాకు షాక్.. ఆ పేటెంట్‌ను ఉల్లంఘించినందుకు 174.5 మిలియన్ల జరిమానా..

by Dishafeatures2 |
మెటాకు షాక్.. ఆ పేటెంట్‌ను ఉల్లంఘించినందుకు 174.5 మిలియన్ల జరిమానా..
X

దిశ, వెబ్‌డెస్క్: ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాకు యూఎస్ హైకోర్టు షాకిచ్చింది. మరో యాప్ మేకర్‌కు 174.5 మిలియన్ డాలర్లకు మెటా చెల్లించాలని యూఎస్ కోర్టు తీర్పునిచ్చింది. లైవ్ స్ట్రీమింగ్ పేటెంట్ ఉల్లంఘన కారణంగానే మెటాకు ఈ జరిమానా విధించినట్లు యూఎస్ కోర్టు తెలిపింది. కోర్టు ప్రకారం.. వాకీ-టాకీ యాప్ మేకర్ ఓక్సర్ కో ఫౌండర్ టామ్ కేటిస్ డెవలప్ చేసిన రెండు స్ట్రీమింగ్ పేటెంట్‌లను ఉల్లంఘించినందని పేర్కొంది. ఫేస్‌బుట్ లైవ్, ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా మెటా ఈ ఉల్లంఘనకు పాల్పడిందని కోర్టు తెలిపింది. అందుకు గాను మెటా సంస్థ ఓక్సర్‌కు 174.5 మిలియన్ డాలర్ల పెనార్లీ చెల్లించాలని కోర్టూ తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుతో మెటాకు భారీ షాక్ తగిలింది. అయితే మాజీ సోల్జర్ కేటిస్.. ఆఫ్ఘనిస్తాన్‌లో తాను యుద్ధ భూమిలో కమ్యునికేషన్ సమస్యలను పరిష్కరించుకునేందుకు పేటెంట్స్‌ను కనిపెట్టారు. తాజాగా ఫేస్‌బుక్ లైవ్‌స్ట్రీమ్, ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌స్ట్రీమ్ ద్వారా మేటా ఈ పేటెంట్స్ ఉల్లంఘనకు పాల్పడటంతో కేటిస్ కోర్టును ఆశ్రయించాడు.


Next Story

Most Viewed