- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.1000లోపు UPI సపోర్ట్ చేసే నాలుగు ఫోన్లు ఇవే !
రూ. 1,000 లోపు UPI సపోర్ట్ ఫోన్లలో నోకియా, జియో, హెమ్ డీ, జియో భారత్ ఉన్నాయి.

UPI support phones under Rs 1,000
దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. చాలామంది టచ్ స్క్రీన్ ఫోన్లను మాత్రమే వాడుతున్నారు. కానీ చదువు రాని వాళ్ళు మాత్రం ఇప్పటికి కూడా కీప్యాడ్ ఉన్న ఫోన్ లను వాడుతున్న సంగతి తెలిసిందే. అయితే కీప్యాడ్ వాడే కస్టమర్లకు తగ్గట్టుగానే మార్కెట్లో మంచి ఫోన్స్ ఉన్నాయి. యూపీఐ సపోర్ట్ చేసే ఫోన్లను కూడా మార్కెట్లోకి తీసుకువచ్చాయి కంపెనీలు. కేవలం 1000 రూపాయల లోపు ఈ ఫోన్లు లభిస్తున్నాయి. వాటి వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.
రూ.1000లోపు UPI సపోర్ట్ చేసే నాలుగు ఫోన్లు ఇవే !
యూపీఐ సపోర్ట్ చేసే మొబైల్స్ లో నోకియా మొదటి వరుసలో ఉంటుంది. నోకియా 105 క్లాసిక్ ( Nokia 105 Classic) ఫోన్ ను అమెజాన్ లో కొనుగోలు చేస్తే కేవలం 979 రూపాయలు పడుతుంది. ఈ మొబైల్ లో యూపీఐ అప్లికేషన్ కూడా ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లేకుండానే ఈ మొబైల్ ద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చు. జియో భారత్ V4 4G మొబైల్ ( JioBharat 4G ) కూడా వెయ్యి రూపాయల లోపు అందిస్తున్నారు. ఇందులో యూపీఐ సేవలను వినియోగించుకోవచ్చు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. రిలయన్స్ డిజిటల్, ఫ్లిప్కార్ట్ లో ఈ మొబైల్ కొనుగోలు చేస్తే 799 రూపాయలకు లభిస్తుంది.
HMD 105 మొబైల్ ఫోన్ ను అమెజాన్ లో కొనుగోలు చేస్తే వెయ్యి రూపాయల వరకు పడుతుంది. ఇందులో కూడా యూపీఐ సేవలు వినియోగించుకోవచ్చు. అటు జియో భారత్ k1 కార్బన్ ఫోన్ ( jiobharat Karbonn K1 4G) అమెజాన్ లో కొనుగోలు చేస్తే 799 రూపాయలు పడుతుంది. ఇందులో కూడా యుపిఎస్ సేవలను చాలా సులభంగా వినియోగించుకోవచ్చు. అయితే మైక్రోమ్యాక్స్, లావా లాంటి బ్రాండ్ ఫోన్లలో వెయ్యి రూపాయల లోపు ఫోన్స్ లభిస్తాయి కానీ... వాటిలో యూపీఐ సేవలు ఉండవు.






