- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPHONE 17 PRO MAX కోసం అడుక్కుంటున్న యువతి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!
సాధారణంగా తినడానికి తిండి లేదని చాలా మంది బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, గుళ్లు గోపురాల వద్ద డబ్బులు అడుక్కుంటూ ఉంటారు. ఒక రూపాయో రెండు రూపాయలో ఇస్తే వాటిని పోగు చేసుకుని కడుపు నింపుకుంటారు. కానీ ఓ యువతి తనకు ఐఫోన్ కావాలి అంటూ ఆన్ లైన్ లో అడుక్కోవడం మొదలు పెట్టింది.

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా తినడానికి తిండి లేదని చాలా మంది బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, గుళ్లు గోపురాల వద్ద డబ్బులు అడుక్కుంటూ ఉంటారు. ఒక రూపాయో రెండు రూపాయలో ఇస్తే వాటిని పోగు చేసుకుని కడుపు నింపుకుంటారు. కానీ ఓ యువతి తనకు ఐఫోన్ కావాలి అంటూ ఆన్ లైన్ లో అడుక్కోవడం మొదలు పెట్టింది. ఉత్తరప్రదేశ్ లోని లిఖింపూర్‌కు చెందిన మహి సింగ్ అనే యువతి బ్యూటీ క్వీన్ పేరున్న ఐడీతో ఇన్ స్టాలో వీడియోలు చేస్తూ ఉంటుంది. ఈమెకు చాాలా మంది ఫాలోవర్స్ కూడా ఉన్నాారు. కాగా తనకు ఫోన్ 17 ప్రో కావాలని ఒక్కొక్కరూ రూపాయి, రెండు రూపాయల చొప్పున ధానం చేస్తే కొనుక్కుంటానని వీడియోలో చెబుతోంది.
ఐఫోన్ 17 కలర్ డిజైన్ తనకు ఎంతగానో నచ్చాయని తెలిపింది. మూడు నెలల క్రితం తన తండ్రి మొబైల్ తీసేసుకున్నాడని కాబట్టి అందరూ కలిసి తనకు ఫోన్ కొన్నివ్వాలని రిక్వెస్ట్ చేసింది. ఫోన్ కొనిస్తే రెగ్యులర్ గా వీడియోలు చేస్తానని చెప్పింది. అంతే కాకుండా గూగుల్ పే స్కానర్ సైతం ఆ యువతి షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇలా అడుక్కోవడం ఇప్పటి వరకు చూడలేదని ఇది కొత్త రకం బెగ్గింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి వారికి దానం చేస్తే పుణ్యం కంటే పాపం తగులుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఐఫోన్ 17 ఫోన్లను మార్కెట్ లోకి యాపిల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ల కోసం చాలా మంది మొబైల్ స్టోర్స్ ముందు క్యూ కడుతున్నారు. video






