- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kingfisher Beers: కింగ్‌ఫిషర్ జోరు మాములుగా లేదుగా.. ఈ మ్యాటర్ తెలుసుకుంటే తాగింది దిగిపొద్ది!
United Breweries Shares: కొన్నిరోజుల క్రితం తెలంగాణలో మందుబాబులకు కింగ్ ఫిషర్ బీర్ల తయారు కంపెనీ అయిన యునైటెడ్ బ్రేవరీస్ మత్తు దిగే వార్త చెప్పిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : United Breweries Shares: కొన్నిరోజుల క్రితం తెలంగాణలో మందుబాబులకు కింగ్ ఫిషర్ బీర్ల తయారు కంపెనీ అయిన యునైటెడ్ బ్రేవరీస్ మత్తు దిగే వార్త చెప్పిన సంగతి తెలిసిందే. కింగ్ ఫిషర్, హెనికిన్ బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ స్టాక్ పడిపోయింది. ఇప్పుడు చేసిన ఒకే ఒక్క ప్రకటనతో మళ్లీ 5 శాతం అప్పర్ సర్య్కూట్ కొట్టేసింది. ఇది మందుబాబులకు అసలైన కిక్కించే వార్త అని చెప్పవచ్చు.
స్టాక్ మార్కెట్లో(Stock Market) ఇన్వెస్ట్ చేసేవారు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చిన్న ప్రకటనతో కూడా ఆయా స్టాక్స్ అప్పర్ సర్య్కూట్ చేరుకుంటాయి. అందుకే కంపెనీ నుంచి వెలువడే ప్రకటనలు, పెట్టుబడులు, వ్యూహాలు ప్రణాళికలకు సంబంధించిన ఒప్పందాలు ఇలా అన్నింటినీ గమనిస్తుండటం వల్ల పెట్టుబడి పెట్టేవారికి మంచి రాబడి అందుకోవచ్చని చెప్పవచ్చు. ఇప్పుడు దిగ్గజ సంస్థ, ప్రముఖ కింగ్ ఫిషర్(Kingfisher Beers), హెనికిన్ బీర్(Heineken beer) బ్రాండ్ తయారీ సంస్థ యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్(United Breweries Limited) కీలక ప్రకటన చేసింది. దీంతో ఆ స్టాక్ ఇప్పుడు జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. కొన్నాళ్ల క్రితం తెలంగాణ కింగ్ ఫిషర్ల బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రేవరీస్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి మందుబాబులు డీలాపడిపోయారు. ఎందుకంటే ఇది ఫేవరేట్ బ్రాండ్ కాబట్టి.
అయితే తాజాగా ఈ అంశానికి సంబంధించి ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ బ్రేవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్(United Breweries Limited) కు బీర్ సరఫరా పున ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్ లో యునైటెడ్ బ్రేవరీస్ సంస్థ వెల్లడించింది. సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్లో(Stock Market) లిస్ట్ అయిన కంపెనీలు తమ నిర్ణయాలను ఎప్పటికప్పుడు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియపరుస్తుంటాయి.
Kingfisher is back in Telangana! https://t.co/N1Xqdmguo5 pic.twitter.com/7m30GD2Tjq
— (AR)SHytan (@watARSHmelon) January 20, 2025
ఈ ప్రకటన చేసిన వెంటనే షేర్ ధర అప్పర్ సర్క్యూట్ ను తాకింది. ఒక దశలో 6శాతానికి పెరిగింది. ఇంట్రాడెల్(Intradel) లో రూ. 2075 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం 5శాతానికిపైగా లాభంతో దూసుకుపోతోంది. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 53.51వేల కోట్లు ఉంది. ఈ క్రమంలోనే ఇందులో పెట్టుబడి పెట్టినవారికి మంచి లాభాలు వస్తాయని చెప్పవచ్చు. ఇటీవల బీర్ల సరఫరా నిలిపివేత ప్రకటన సమయంలో స్టాక్ ఒక దశలో 4 శాతానికి పడిపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కూడా నష్టాలనే ఇచ్చింది. తాజా ప్రకటనతో మాత్రం స్టాక్ మళ్లీ పుంజుకునేందుకు దోహదం చేసింది.






