చాట్‌జీపిటీని గుడ్డిగా నమ్మకండి : ఓపెన్‌ఏఐ సీఈవో హెచ్చరిక

by Naga Rani Yarlagadda |

ఓపెన్‌ఏఐ (Open AI) అధికారిక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. “చాట్‌జీపిటీపై గుడ్డి నమ్మకం మంచిది కాదని హెచ్చరించారు.

చాట్‌జీపిటీని గుడ్డిగా నమ్మకండి : ఓపెన్‌ఏఐ సీఈవో హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ఎవరైనా ఏఐను మానవతకు ముప్పుగా భావిస్తున్నారా? లేక ప్రతి రోజూ మీ ఫోన్ హోమ్‌స్క్రీన్‌పై చాట్‌జీపిటీ ఐకాన్ ఉండేవారిలో మీరు ఒకరా? ఏ విభాగానికి చెందినవారైనా సరే.. ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మీకు చక్కటి హెచ్చరికగా నిలవవచ్చు.

ఓపెన్‌ఏఐ అధికారిక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. “చాట్‌జీపిటీపై ప్రజలకు అధిక స్థాయిలో నమ్మకం ఉంది. ఇది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఏఐ కూడా హల్లుసినేట్ చేస్తుంది. అసలు అది అంత నమ్మదగిన టెక్నాలజీ కాదు” అని పేర్కొన్నారు. తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు. తాను తండ్రి అయిన తొలినాళ్లలో బిడ్డ నిద్ర వేళల నుంచీ డైపర్ రాష్‌కి తీసుకోవాల్సిన చర్యల వరకూ అన్ని విషయాల్లోనూ చాట్‌జీపిటీ సహాయాన్ని తీసుకున్నానని చెప్పారు. కానీ తరువాత తనకే గుర్తొచ్చిందట. “ఇది ప్రతి సారి సరైనదే అనుకోవడం తప్పు”.

ఈ సందర్భంగా ఆయన చాలా స్పష్టంగా హెచ్చరించారు. “మనం ఇప్పుడు ఎంతో శక్తివంతమైన దశ ఆరంభంలో ఉన్నాం. అయితే మనం జాగ్రత్తగా ఉండకపోతే.. నమ్మకం అనేది దాని నమ్మకార్హతను మించి పోతుంది. అందుకే సమాజానికి గైడ్‌లైన్స్ అవసరం.” ఇటువంటి పరిస్థితిలో.. ఏదైనా విషయాన్ని ఏఐతో చర్చించడం, సూచనలు తీసుకోవడం మంచిదే కానీ.. ఫైనల్ డెసిషన్‌గా తీసుకోవడం మంచిదికాదని ఆయన సూచిస్తున్నారు.

కెనడాలోని టొరొంటో విశ్వవిద్యాలయంలో ఏఐ ఎథిక్స్ నిపుణురాలు డాక్టర్ మెలిస్సా ట్రాన్ ఈ సమస్యను అద్భుతంగా వివరించారు. “ఇది చాలా నమ్మకంగా మాట్లాడుతుంది. అందుకే దీనికి నిజంగా తెలుసునని భావించి, ప్రజలు దానిపై నమ్మకం పెంచుకుంటున్నారు. కానీ అలా కాదు.” సాధారణ ప్రజల నుంచి ప్రముఖులకు వరకూ చాట్‌జీపిటీపై ఆధారపడే పద్ధతి పెరుగుతుండటాన్ని గమనిస్తూ. దీన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సామ్ ఆల్ట్‌మన్ హెచ్చరించారు.

Next Story