Chat GPT: చాట్ జీపీటీ యూజర్లకు అలర్ట్.. ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు

by Ajay Maddhiboyina |

ఓపెన్ ఏఐకి సంబంధించిన చాట్ జీపీటీ సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. మ‌ధ్యాహ్నం 2.45 నుండి ఇండియాలో చాట్ జీపీటీ సేవ‌ల‌కు అంత‌రాయం క‌లిగింద‌ని వంద‌ల సంఖ్యలో యూజ‌ర్లు ఫిర్యాదు చేస్తున్నారు.

Chat GPT: చాట్ జీపీటీ యూజర్లకు అలర్ట్.. ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు
X

దిశ‌, వెబ్ డెస్క్:ఓపెన్ ఏఐకి సంబంధించిన చాట్ జీపీటీ సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. మ‌ధ్యాహ్నం 2.45 నుండి ఇండియాలో చాట్ జీపీటీ సేవ‌ల‌కు అంత‌రాయం క‌లిగింద‌ని వంద‌ల సంఖ్యలో యూజ‌ర్లు ఫిర్యాదు చేస్తున్నారు.దేశంలో 82శాతం మంది వెబ్ సైట్ ద్వారా చాట్ జీపీటీ వినియోగించే వాళ్లు ఫిర్యాదు చేయ‌గా, 14శాతం మంది మొబైల్ అప్లికేష‌న్ ఉప‌యోగించే యూజ‌ర్లు ఫిర్యాదు చేశారు.

అయితే చాట్ జీపీటీ సేవలు కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా స్థంబించిపోయాయి. అమెరికాలో వెయ్యికి పైగా యూజర్లు చాట్ జీపీటీ రావడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ అంతరాయంపై చాట్ జీపీటీ సంస్థ స్పందించింది. కొంతమంది యూజర్లకు అంతరాయం కలుగుతుందని, సమస్యను గుర్తించి పరిష్కరించడానికి తాము ప్రయత్నిస్తున్నామని తెలిపింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏఐని ఎలా వాడుతున్నారో తెలిసిందే. కంటెంట్, ఫోటులు, వీడియోలు, కోడింగ్ ఇలా చాలా పనులకు చాట్ జీపీటీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే సేవలకు అంతరాయం కలగటంతో వినియోగదారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

Next Story