పెళ్లిళ్ల సీజన్‌లోనూ తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధ‌ర‌లు ఎంత పెరిగాయంటే?

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-21 06:33:58  IST  )

తాజాగా మరోసారి నేడు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1,910 పెరిగింది.

పెళ్లిళ్ల సీజన్‌లోనూ తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధ‌ర‌లు ఎంత పెరిగాయంటే?
X

దిశ, వెబ్ డెస్క్: మళ్లీ శుభముహూర్తాలు మొదలయ్యాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయితే పెళ్లంటే గుర్తుకు వచ్చేది బంగారమే. అయితే ఇంతకాలం పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు పెళ్లిళ్ల సీజన్ లోనూ పైపైకి వెళుతున్నాయి. తాజాగా మరోసారి నేడు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1,910 పెరిగింది.

దీంతో బంగారం ధర రూ.1,59,280కి చేరుకుంది. అదే విధంగా 22క్యారెట్ల బంగారం ధర రూ.1,46,000గా ఉంది. ఇక హైదరాబాద్ లోనూ 24క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ. 1,59,280గా ఉండగా 22క్యారెట్ల బంగారం ధర రూ.1,46,000గా ఉంది. గురువారం వెండి కేజీ ధర రూ.2,70,000 ఉండగా శుక్రవారం దేశ వ్యాప్తంగా రూ.5వేలు పెరిగింది. దీంతో రూ.2,75,000లకు చేరుకుంది. అయితే హైదరాబాద్ లో మాత్రం ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,90,000గా ఉంది.

Next Story