- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ స్మార్ట్‌ఫోన్ ను ఇలా తుడుచేస్తున్నారా ? అయితే ఇవి తెలుసుకోండి
కళ్లద్దాలు తుడిచే మెత్తటి మైక్రో ఫైబర్ క్లాత్ తో మాత్రమే స్మార్ట్‌ఫోన్ లెన్స్ క్లీనింగ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర కచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉంటోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ వాడడమే కాదు, ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలనే దాని పైన కూడా క్లారిటీ ఉండాలి. ఇష్టం వచ్చినట్లు వాడితే, ఎంత ఖరీదైన మొబైల్ అయినా షెడ్డుకు వెళ్లాల్సిందే. అయితే సాధారణంగా స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్లు.. మొబైల్ కెమెరాలను తమ షర్ట్ లేదా ప్యాంట్ తో గట్టిగా తుడుస్తారు. అలా తుడిస్తే ఫోటోలు అందంగా వస్తాయని వాళ్ల నమ్మకం. కానీ అలా చేస్తే కెమెరాకు ఉన్న సున్నితమైన లెన్స్ మొత్తం పాడైపోతాయని చెబుతున్నారు నిపుణులు.
కెమెరాపై అలా గట్టిగా తుడిచినప్పుడు లెన్స్ పైన సూక్ష్మమైన గీతలు పడతాయని చెబుతున్నారు. తద్వారా ఫోటోల నాణ్యత పూర్తిగా దెబ్బ తింటుంది. ఇక కెమెరాలకు ఒలియోఫోబిక్ కోటింగ్ ఉంటుంది. ఫోన్ కెమెరా లపై వేలిముద్రలు, జిడ్డు పడకుండా ఇది కాపాడుతుంది. అయితే గరుకుగా ఉన్న క్లాత్ తో కెమెరా తుడిస్తే ఆ కోటింగ్ పూర్తిగా అరిగిపోతుంది. అలా చేసినా కూడా ఫోన్ కెమెరా డ్యామేజ్ అవుతుంది. దాంతో ఫోటోలు నాణ్యత లేకుండా వస్తాయి.
అసలు మొబైల్ లెన్స్ ఎలా క్లీన్ చేయాలి
కళ్లద్దాలు తుడిచే మెత్తటి మైక్రో ఫైబర్ క్లాత్ తో మాత్రమే కెమెరా లెన్స్ క్లీనింగ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. లెన్స్ పైన ఉన్న దుమ్మును మొదట నోటితో ఊది, ఆ తర్వాత క్లాత్ తో మెల్లగా తుడవాలి. లెన్స్ క్లీనింగ్ చేసేటప్పుడు కెమికల్ లేదా శానిటైజర్ నేరుగా స్ప్రే చేయకూడదు. మైక్రో ఫైబర్ క్లాత్ కు స్ప్రే చేసిన తర్వాత తుడవాలి. ఇలా చేస్తేనే మొబైల్ కెమెరాలు ఎక్కువ రోజులు లైఫ్ ఇస్తాయి అంటున్నారు.






