రూ. 5వేల లోపు ధరలో టాప్ బడ్జెట్ ఎయిర్ కూలర్లు ఇవే..!

by velandi.Saikiran |

ఎండాకాలంలో కూల‌ర్స్ డిమాండ్ పెరిగింది. ఈ త‌రుణంలోనే రూ.5000లోపు ఉన్న కూల‌ర్లు వైర‌ల్ గా మారాయి.

రూ. 5వేల లోపు ధరలో టాప్ బడ్జెట్ ఎయిర్ కూలర్లు ఇవే..!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే ఎండలు ప్రారంభం కాగా.. ఇప్పుడు ఉష్ణోగ్రతలు 40కి పైగానే నమోదు అవుతున్నాయి. మధ్యాహ్నం అయితే బయట అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంటోంది. అదే సమయంలో ఇంట్లో కూర్చుంటే ఉక్కపోత. దీంతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయితే ఎండాకాలం రాగానే, మూలన ఉన్న కూలర్లు తీసి కొంతమంది వాడుతుంటే.. మరికొంతమంది బడ్జెట్లో కొత్త కూలర్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ లో ఉన్న ఎయిర్ కూలర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బడ్జెట్ లో ఎయిర్ కూలర్లు

మిడిల్ క్లాస్ జనాలు బడ్జెట్ లోనే ఎయిర్ కూలర్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. వాళ్లకు తగ్గట్టుగానే లివ్ ప్యూర్ కూల్ బడ్ నియో అందుబాటులో ఉంది. ఈ కూలర్ ధర రూ.4950గా మార్కెట్ లో ఉంది. 125W పవర్ ను తీసుకుంటుంది. ఈ కూల‌ర్ ఇన్వెర్ట‌ర్ పై ఎక్కువ సేపు న‌డుస్తుంది. ఈ కూల‌ర్ 48 లీట‌ర్ల కెపాసిటీ కలిగి ఉంటుంది. ఓరియంట్ ఎల‌క్ట్రిక్ డ్యూరాచిల్ కూడా రూ.5040కే రానుంది. ఈ కూల‌ర్ 40 లీట‌ర్ల కెపాసిటీ క‌లిగి ఉంటుంది. అన్ని కూల‌ర్ల కంటే 20 శాతం గాలిని ఇవ్వ‌నుంది.

బజాజ్ PX25 టార్క్ ఎయిర్ కూలర్ ను రూ.5099ల‌కు ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే రానుంది. ఈ కూల‌ర్ 24 లీట‌ర్ల కెపాసిటీని క‌లిగి ఉంటుంది. 16 అడుగుల వ‌ర‌కు ఈ కూల‌ర్ గాలి వీస్తుంది. సింఫనీ ఐస్ క్యూబ్ 27 పర్సనల్ రూమ్ ఎయిర్ కూలర్ అమెజాన్ లో రూ.4999ల‌కే ల‌భించ‌నుంది. ఉషా కూల్‌బాయ్ పర్సనల్ ఎయిర్ కూలర్ కూడా ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తే, రూ.4450 ల‌కు ల‌భించ‌నుంది.

Next Story